పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

సంపుటములలో నిప్పటికిది యున్నతస్థాన మలంకరించుచున్నది. చతుర్ధాష్టమ సంపుట కథావిన్యాసము లీగ్రంధకర్తకుఁ గథానిర్మాణ చతుర్ముఖత్వమును దప్పక యొసంగు చున్నది. బ్రహ్మశ్రీ మధిర సుబ్బన్నదీక్షితులవారి గ్రంథరచనాములంబున గుణాఢ్యాదిమహాకధ కీర్తిప్రతినిధియగు శాశ్వతఖ్యాతి సంపాదించిరని మాయభిప్రాయము వీనియభ్యుదయపరంపర సర్వేశ్వరుం డొనగూర్చుగాక యని మాప్రార్ధనము.

ఇట్లు

మానవల్లి రామకృష్ణకవి.

రాజమహేంద్రవరమున డిస్ట్రిక్టుమునిసిఫ్ పదవిలో నుండు బ్రహ్మశ్రీ శ్రీమాన్ మ. కృష్ణమాచార్యులవారు ఎం, ఏ, ఎం, ఎల్, పి, హెచ్', డి. బిరుదాంకితులు ఈక్రింది యభిప్రాయము నాంగ్లేయభాషలో దయచేసి యొసంగిరి,

శ్రీమత్పండిత మధిర సుబ్బన్నదీక్షితులవారిచే రచింపఁబడిన "కాశీమజిలీకథ" లను పేర నొప్పు కధా సమూహ మింత కాంధ్రదేశమంతయుఁ జక్కఁగా నెఱింగినదే కావున నేను బ్రశంసింపవలసిన యావశ్యకతలేదు. ఆగ్రంధముల కిడిన కేవలనామముసహితము మసకుఁ బవిత్రమైన భావమును హృదయమున నుత్పాదింపఁజేయుటయేకాక పూర్వకాలమున రాకపోకలకు మనకువలె సౌలభ్యములు లేకుండియుఁ గ్లేశనదియైన మన పెద్దలు గాలినడకతో పుణ్యపట్టణమైన. కాశీని దర్శించిరాఁగలంత భక్తిశ్రద్ధలు వహించియుండిరను నాశ్చర్యమును గలిగించుచున్నవి. జనసమూహముల నాహ్లాదింపఁ జేయుటకుఁ గథాకధనము మనహిందూదేశములో నతిప్రాచీనవిద్యయే. దానికి రెండు విధముల ప్రయోజనముగలదు ఈకథలు ధర్మపరాక్రమముల తత్వప్రభావముల నుపదేశించుటయేకాక అప్పటి దీర్ఘకాలమార్గా యానమును యాత్రికసంక్లేశమును దొలఁగించుచుండను మతవిషయమునను ఆధ్యాత్మిక విషయమునను విశ్వాసములేక శంకా కళింకితమగు నేఁటికాలమున స్వభావంలో శులభశైలి వ్రాయఁబడిన యీకథలు హిందూదేశమున నాదియగు వేదశాస్త్రపురాణాది విద్యాప్రపంచమున నేది యేది శ్రేష్టమో శాశ్వతస్మరణీయమో దానినెల్లఁదప్పక బునరుజ్జీవనముచేయుచున్నవి. ఇవి యవనయామీనీ వినోదకధలలోని చమత్కృతిప్రభావము చూపుచున్నను, శబ్దరచనయందును భావములయందును అశ్లీలథర్మసాంకర్యాది దోషములులేక భాసిల్లుచున్నవి. కథలకిచ్చిన పేరును సంవిధానధోరణియు సమస్తవిషయసంగ్రాహకమగుటచే యట్లే కొనసాగుచుండినయెడల నిదితప్పక హిందూపురాణ గాథాకోశమై సర్వవాఙ్మయమున కాదర్శ మైయొప్పుననుట యసాధ్యము గాదు.

యమ్. కృష్ణమాచారి.