పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

జుట్టువేదికయు నలికి మ్రుగ్గులు పెట్టుచుండును. కోడి, కుక్క, పంది లోనగు నీచజంతువుల నాప్రాంతము చేరకుండఁ గాపాడుచుండును. పంచములలో సంతానశూన్యులుండుట యరుదు ఆపల్లెలో మాతంగుఁ డొక్కఁడే యనపత్యుఁడు ఒకనాడు మాలిని మగనితో నాథా! మనకులము వారందఱికి సంతతి పూర్తిగాఁ గలిగియున్నది. ఇందు మనమే బిడ్డలులేనివారము. నీవు కులవిరుద్ధముగా స్నానము జపము పూజలు సేయుచుండుటచేఁ బిల్లలు గలుగలేదని యెల్లరు చెప్పికొనుచున్నారు. తండ్రితాత లెఱుంగని యీనియమబులు మనకేల? ఇదిబెడిసికొట్టిన దేమో మానివేయరాదా ? అని యుపదేశించిన మాతంగుఁడిట్లనియె.

ఓసీ! వెఱ్ఱిదానా! మనము పెట్టిపుట్ట లేదు. చేసికొనక యేదియు రాదు. స్నానము పూజయు బిడ్డల కడ్డుపెట్టునా ? మన కులమువారు తెలియనివారగుట నట్లనుచున్నారు ఆమాటలఁ బాటింపకుము. యోగముండిన మానదని సమాధానముజెప్పెను. హిందూమతములో నెట్టి యల్పులకైన వేదాంతము సహజముగానుండును. ప్రారబ్ధమన నెట్టిదో యెఱుఁగని వారైనను నాపదలు వచ్చినప్పుడు ప్రారబ్ధమని పలుకుచుందురు.

మఱియొకనాఁడు మాలిని మాలనితో నాధా ! మొన్న నొక నూనిగుడ్డలవాఁడు కిన్నరమీటుచుబిచ్చమునకై మనయింటికివచ్చెను. తోడికోఁడలి నిర్బంధమునఁ బిల్లలు కలుగుదురా? అని వానిశకునమడిగితిని వాఁడు మంత్రములఁబాడుచు నాచేయిచూచి నీకుగాలిసోకి పిల్లలు గలుగకుండ నడ్డుపెట్టుచున్నది. రచ్చ రేకు గట్టికొనినం బుట్టుదురు. కుంచెడు ధాన్యమిచ్చినచోఁ దాయెత్తిచ్చెదనని చెప్పిననొప్పుకొనక రేపురమ్మని యంపివేసితిని. ఇందులకు మీరేమందురు. తాయెత్తు గట్టి కొనవచ్చునా? అని యడిగిన మాతంగుఁడు నవ్వుచు బిచ్చగాండ్రమాటలు నమ్మరాదు. నీకుఁ గావలసిన నూరిలోనికిఁబోయి గొప్పవారల