పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతంగుని కథ.

117

మీమాటలో నొకదాని కొకటి సందర్భముగాలేదు. నామాట వినుపించుకొనకుంటిరా ? మీరు విజ్ఞానసంపన్నులని విని మీవలన నతీత జ్ఞానవిశేషంబెఱుంగు తలంపుతో వచ్చితిని. మీరు సామాన్యులు చెప్పుమాటలే చెప్పుచుంటిరి ? తగుసమాధానము చెప్పుడని ప్రార్ధించినది. అదియేమియు నతండెరుఁగక కన్నులు మూసికొనియె.

శ్లో. యోగినాంభోగినామపి

అని చదివినంతఁ జింతామణి యయ్యతి తన్నవమానించెనని యభిమానము జెందినది. తోడనే క్రోధోదయమైనది. అసూయ దానింబెని వైచికొనియె. యుండుంగదా ? నిర్మలమైన చింతామణి చిత్తమును గ్రోధాదులు స్వాయత్తమును జేసికొనినవి. ఎట్లైన నయ్యతీశ్వరుని వంచింపవలయునని యన్నెలంతకు సంకల్పము జనించి మఱి పల్కరింపక యింటికింబోయినది.

ఉ. దానము థర్మమున్ జపము తర్పణముల్ శుచివృత్తి స్నానసం
    థ్యానియమంబు లెన్నియయినం బొనరింపఁగ వచ్చుగాని వి
    ద్యానిధులైన యోగయుతులైన మహామునులైన జన్మలో
    మానసమంటియున్న యభిమానము వీడఁగ లేరు ధారుణిన్.

-♦ మాతంగుని కథ. ♦-

ఆప్రయాగమున కుత్తరముగా గ్రోశదూరములో నొక మాలపల్లెకలదు. అందు మాతంగుఁడను పుల్కసుఁడు మాలినియనుభార్యతోఁ గాపురముచేయుచుండెను. వాఁడు నిత్యము సూర్యోదయ కాలమున గంగలో మునింగి రవిబింబమునకు మ్రొక్కి యింటికివచ్చి పట్టెవర్ధనములుపెట్టి తనగుడిసెలో నొకమూలవేదికపై దేవతగా నిలిపియున్న మట్టి విగ్రహమును బూజించి పిమ్మటఁ గులవృత్తి జేసికొనుచుండును.

వాని పెండ్లాము మాలినియు వాని చిత్తవృత్తి ననుసరించి నిత్యము శుచిగా వాఁడు గంగకుఁబోయి వచ్చులోపల గుడిసెయుఁ