పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చింతామణి కథ.

115

శ్లో. ఫాలేన ముగ్ధ చపలేనవిలోకనేన
    మన్మాన సె కిమపిచాపలముద్వహంతం
    లోలేన లోచన రసాయన మీక్షణేన
    లీలాకిశోర ముపగూహితు మత్శుకోస్మి.

అని యెఱింగించి తదనంతరచరిత్రము పై మజిలీయందుఁ జెప్పుచుండెను.

147 వ మజిలీ.

−♦ అగ్నిశిఖునికధ. ♦−

చిత్రసేనా! చింతామణీ సదుపదేశంబునంగాదే లీలాశుకుండు పరమభక్తాగ్రేసరుండై శ్రీకృష్ణదయాపాత్రుం డయ్యె నక్కాంత కులకాంతాతిశయనయస్ఫూర్తిఁ బేర్పొందినది సౌశీల్యంబు సహజంబుగాని కులానుగతంబుగాదని యెఱింగించినవిని చిత్రసేన పరమానంద భరితహృదయయై మహాత్మా! చింతామణి యుదంతము మిక్కిలి సంతసము గలుగఁజేసినది. మఱియు లీలాశుకుండు విరక్తుండై యరిగిన తరువాతఁ జింతామణి యెట్లు ప్రవర్తించినది ? వారిరువురు మఱల నెన్నఁడైనఁ గలిసికొనిరా? తదనంతర వృత్తాంత మాలింప వేడుకయగుచున్నది. వివరింతురే? యని యడిగిన నప్పుడమి వేల్పిట్లనియె.

బాలా ! లీలాశుకుండు. మహాభక్తుండైన పిమ్మటఁ దిరుగాఁ జింతామణి యింటికిరాలేదు. చింతామణియు నతండుత్తమవ్రతుండైం భగవంతు నారాధించుచుండెనని విని సంతసించుచుఁ దన్నుఁజూచి యతండు చాంచల్యమును నేమోయని యెన్నడు నతని దాపునకుఁ బోయినదికాదు. మఱియులీలాశుకునకు విరక్తి గలుగఁ జేయతలంపుతో నాటిఁరాత్రి వేసిన వేసమే వేషముగా తిరుగా దివ్యమణిభూషాంబరాదుల ధరింపలేదు. మేనికి నాఁడుబూసినబూడిదయే బలపరచి కాషాయాంబర ధారిణియై ప్రాగ్భవప్రభోధోద్భావంబునఁ దనయాస్తి యం -