పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చింతామణి కథ.

113

చింతామణి యుదేశంబునఁదనకు భగవంతుని దర్శనమైనదని సంతసించుచు మొట్టమొదటఁ జింతామణినే స్మరించి యామహానుభావురాలు సర్వోత్కృష్టురాలై యుండుగావుత అని కొనియాడాను. తరువాత మంత్రోపదేశము గావించిన సోమగిరి యతీశ్వరునిఁ దలచెను. అటుపిమ్మటఁ దనకుఁగనంబడిన శిఖిపింఛమౌళిని శ్రీకృష్ణు నభినందించె తనకు దర్శనమిచ్చి కన్నులందెరచి చూచినంత నదృశ్యుఁడైన శ్రీకృష్ణుని గుఱించి యీశ్లోకమురచించె.

శ్లో. పునః ప్రసన్నేన ముఖేందుతేజసా
    పురోవతీర్ణస్య కృపామహాంబుధేః!
    తదేవ లీలా మురళీరవామృతం
    సమాధి విఘ్నాయ కదాను మే భవేత్.

ముఖచంద్రచంద్రికలు ప్రసన్నములైయొప్ప నాముంగల నిలిచిన దయాసముద్రుండగు నాలీలాడింభకుఁడు వెండియు మురళీరవామృతముచే నాతపోవిఘ్న మెప్పుడు గావించునోయని పొగడెను. మఱియు లీలాశుకుండు శైవుండై విష్ణుభక్తి నిరతుండై నట్లీక్రిందిశ్లోకము వలనఁ దెలియఁబడుచున్నది.

శ్లో. శైవా వయంనఖులు తత్ర విచారణీయం
    పంచాక్షరీ జపపరా నితరాం తథాపి।
    చేతో మదీయ మతసీ కుసుమావభాస
    స్మేరాననం స్మరతి గోపవధూకిశోరం.॥

మేము పంచాక్షరీజపపరులైన శైవులమైనను నాచిత్తము గోప కుమారునియందే వ్యాపించుచున్నదిగదా అని చెప్పుకొనెను.

శ్లో. శంభో ! స్వాగత మాస్యతా మిత ఇతోవామేన పద్మాసన
    క్రౌంచారె కుశలం సుఖం సురపతె విత్తేశ నోదృశ్యతె
    ఇద్ధం స్వప్నగతన్య కైటభజితః శ్రుత్వా యశోదా గిరః
    కిం కిం బాలక జల్పసీతి రచితం ధూధూకృతం పాతునః.