పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

దానిం ద్రాడనుకొని యూతగాఁబూని యెలిసి దిగివచ్చితినని యతం డెఱిఁగించెను. అప్పుడా మోహనాంగి కనేకోహలు జనించినవి. మ్రాన్పడి యాహా ? కామాంధుల కేమియుఁ గనంబడ దన్నమాట సత్యము నాయుపచారములచే వీని తగులము బలమగుచున్నది. వీనికీజన్మమున వివేకము గలుగదు. ఆజ్యమువోసిన నగ్నిచల్లారునా? వీని మూలమున నేనుగూడఁ జెడిపోవుచుంటినని ధ్యానించుచుండ నతండు

గీ. చచ్చినది పాము గాత్రంబు సగముతెగుట
    నందులకుఁ జింతపడెదేల ? యంబుజాస్య
    రమ్ము లోపలికెద విచారమ్ము మాని
    పుష్పశరకేలి నాకు సమ్మోదమిమ్ము.

ఆమాటవిని యాబోఁటి యేమియుమాటాడక తటాలున మరలి లోపలకిఁ బోవుచుండ నతండు వెంట నడుచుచు వాల్గంటీ ! కోపము వచ్చినదా? నేనేమిచేయుదును. నాసంతాపమట్లున్నది. నీవుపేక్షించితి వేని యీరాత్రిశరీరము నిలువదు. అని యడ్డమువచ్చి పాదంబులంబడి బ్రతిమాలికొనుటయు నది పదపద తల్పంబునం గూర్చుండుము. స్నానముచేసి వచ్చెదననిబలికి యయ్యువతి యవ్వలికి బోయినది.

లీలాశుకుండును సంతసముతోఁ గేళీమందిరమున కఱిగి పర్యంకమునఁ గూరుచుండి యాతురతతో నిమిషము యుగమువలెఁ దలఁచుచు దానిరాక నీరీక్షించుచుండె నప్పుడు.

ఉ. వాసనలుప్పతిల్లఁ జెలువుబగు తళ్కు జనింప మేనునం
    బూసిన యంగరాగమది వోవఁగ బూడిదరాచికొంచు సం
    త్రాసమువుట్ట వెండ్రుకలురంబున వ్రేలఁగ నెల్లవస్తువుల్
    దీసి దిగంబరత్న వికృతిం బ్రకటింపుచుఁ గాత్రమయ్యెడన్ .

వికృతరూపముతో వచ్చి యతనియెదుట నిలువంబడి

క. లీలాశుక ! ఇటుచూడుము
    హేలా లీలావిలస లెట్లున్నవొకో