పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చింతామణి కథ.

99

రించి సగౌరవంబుగా దోడైచ్చి పర్యంకోపవిష్టుం గావించి యుపచారంబులఁ జేయుచుండె. అందుల కతండానందించుచు తానుదెచ్చిన కనకమణి భూషాంబరాదు లొసంగి తన యాశయం బెఱింగించుటయు నమ్మించుఁబోఁడి గొన్ని నిబంధనలం గోరికొనినది. అతండియ్యకొని శుభముహూర్తంబున కన్నెఱికము గావించెను.

క. ఇదిపగ లిది రాతిరియని
   మదిఁదెలియక యెల్లపనులు మఱచి సదాయ
   మ్మదవతి సదనము నదలక
   మదనక్రీడలనె బ్రహ్మమయముగ నెంచున్ .

శ్లో॥ సంసారే పటలాంతతోయ తరళె సారం యదేకం పరం
     యస్యాయంచ సమగ్ర ఏషవిషయగ్రామప్రపంచో మతః
     తత్సౌఖ్యం పరతత్వ వేదనమహానందోపమం మందధీః
     కో వావిందతి సూక్ష్మమన్మధకళా వైచిత్ర్యమూఢొ జనః

లీలాశుకుండు చింతామణితోఁగూడఁ దత్వజ్ఞానానందముతో సమమగు మన్మధకలావై దగ్ధ్యసౌఖ్యం బనుభవింపుచు స్నానసంధ్యాది కర్మముల విసజిన్‌ంచి తదధ్యాసన ధ్యానములవలనఁ దృప్తి బొందక సంతతము తనమనంబందే లగ్నంబైయుండ నొండుదెలియక చింతామణి నారాధింపుచుండెను. చింతామణియు వెలయాలైనను జ్ఞానవతి యగుట లీలాశుకుఁడు తనయెడఁ బ్రకటించు మోహాతి రేకంబున కచ్చెరువందుచు స్నేహమునకుం దగిన ప్రీతింజూపుచుఁ ద్రికరణంబుల నతనినే ప్రధానపురుషునిగా నెంచుకొనుచు నతని యాస్తియంతయుఁ దనవశము చేసికొనియు బాహ్మణ ద్రవ్యంబని తాననుభవింపక దాచి విహితముగా నేకచారిణీ వృత్తమునఁ దదీయచిత్తంబు సంతోషాయత్తంబు గావింపుచుండెను.

ఒక యేకాదశినాఁడు చింతామణి ప్రాంతమందలి విష్ణ్వాలయ