పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

    జ్ఞానయ భాసమాన బుధసన్నుత సంపదమానదేవతా
    ధీనమనోనిధాన సురధేను సమానసుదాన చూడఁగన్.

క. గుణవంతురాలు చింతా
   మణి జాతికివేశ్యగాని మహితజ్ఞాన
   ప్రణుతమతి యనుచు నెల్లరు
   గుణుతింతురు ద్రవిణసక్తగాదది మఱియున్

దానియందు వేశ్యాధర్మంబొక్కండును లేదు. విస్రంభపాత్రురాలు. దానిఁగళత్రంబుగా స్వీకరింపవలయునని హితులతో నాలోచించి లీలాశుకుండొకనాఁడు సాయంకాలంబున లలితాంబ మాల్యగంథాలంకారంబులం బట్టించుకొని దానియింటికింజని ముందుఁ దన కులశీలమర్యాదలం దెలుప మిత్రులనియోగించుటయు వారు లోపలికింజని చింతామణింజూచి యిట్లనిరి.

క. లీలాశుకుఁడను బాహ్మణ
   బాలుఁడు నినుఁగోరి వచ్చె బహుధనవిద్యా
   శీలవయో రుచిరుండతఁ
   డేలికొనుము వాని గృహసమేతముగ సఖీ.

గీ. తల్లిదండ్రులు లేరన్న దమ్ములితర
   బంధువులులేరు లేదర్ధభాగభార్య
   యందఱును నీవయైవాని నాదరింప
   వలయుఁ దద్ధన మెల్ల నీవశముజేయు.

తద్రూపాతిశయంబు సూచి నీవేమెచ్చుకొందువు. నీవాకిటనిలిచియున్న వాఁడని యెఱిఁగించిన నాలించి యగ్గణికామణి యంతకుమున్న యాచిన్నవాని యుదంతంబు వినియున్నదగుట నంగీకారము సూచించినది. వారుపోయి యాతనిందీసికొనివచ్చుటయు వాని యందంబు డెందంబున మెచ్చికొనుచు లేచి కొన్నియడుగు లెదురవోయి నమస్క