పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శతావధాని చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారు

బ॥ శ్రీ॥ గురువరులగు మధిర సుబ్బన్నదీక్షితులవారి సముఖమునకు. - కడియము. 15 - 9 - 26

శిష్యుఁడు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి శతావధాని యనేక నమస్కార పూర్వకముగా వ్రాసికొను విజ్ఞాపనము.


గురువరా ! తాము కొలఁదిదినములనాఁడు దయాపూర్వకముగ నొసఁగిన కాశీమజిలీలు అనుపేరుగల భవద్విరచితగ్రంధమునందలి కొన్ని భాగములను నాకొసఁగుచు వీనినిజదివి యభిప్రాయమును దెలుప వలసినదియని సెలవిచ్చి యున్నారు తదేక దృష్టితోఁ దమగ్రంథమునందలి కొన్ని కధలనుజదివితిని. ఇవి కేవలకథలవంటివేకాక వ్యాకరణాదిశాస్త్ర సంప్రదాయమునందేమి యలంకారాదులయందేమి మనప్రాచీనకావ్యములకించుకయుఁ దీసిపోక పాఠకులకు మంచిసాహిత్యజ్ఞానమలవఱచుటకుఁ గడుంగడుఁ దగియున్నట్లు గ్రహింపఁగల్గితిని. సూత్రప్రాయముగా వ్రాసిన యీయభిప్రాయమునందలి సారమును బాఠకలోకము గ్రహింపకపోదని విస్తరింపక యింతతో ముగించుచున్నాఁడను. ఇవియే నానమస్కారములు.

చిత్తగింపుఁడు.

ఇట్లు

భవద్విధేయుఁడు

శతావధాని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి