పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మతంగయోగినికథ.

93

యవధూతవా ? రాజునొద్ద దారుపుకత్తెవై తిఱుగుచుంటివా? చాలు చాలు ఇఁకనీతోమాటాడఁ దగినదానవుకావు. పో .పొమ్ము రతినూపుర యెవ్వతె? విపులుఁడెవ్వఁడు? మేము నీవనికొనినవారము కాము భ్రమసితివి నీదారిని నీవుబొమ్ము. మాకవీంద్రునికి నీపైఁ గోపముపెద్ద. నీగుణమతఁడప్పుడే గ్రహించెను. ఈమాటవిన్న నిన్ను శిక్షించునని పలికినఁ దెలతెలపోవుచుఁ బూఁబోఁడులారా ! మీసుఖముగోరి యిట్లంటి మీకిష్టము లేకున్నఁ బోనిండు నాకేల ? కాని మీరు చేయుచున్నపని చాలతప్పుపని వినుండు తల్లికిఁదెలియకుండ దాని యాస్తి యంతయు దొంగిలించుకొని మారువేషములు వైచికొని యొకబాపనయ్యను దగులుకొని పోవుచున్నారు. మీరు దండనార్హలు. మీతల్లి రాజునొద్ద మీపైనభియోగము దెచ్చినది మిమ్ముఁగట్టించి బలవంతమున దీసికొనిపోయెదఁ జూడుఁడు అని బెదరించుచు నాయోగినియేగినది. చిత్రసేన గోణికాపుత్రుండు వచ్చినతరువాత యోగిని యాడినమాట లన్నియుం జెప్పినది.

అతండాలోచించి మనమిఁక నీదేశము విడిచిపోవలయును. విపులుఁడు మిమ్మువలచియున్నాఁడు కామాంధులు యుక్తాయుక్తశూన్యులు. ఏమిచేసినం జేయఁగలరు. అని పలుకుచు నిలుకడమాని హుటాహుటి పైనంబులు సాగింపుచుండెను.

ఒకనాఁడు చిత్రసేన వేశ్యాజనప్రవృత్తిని గర్హించుచు మాకులములో సద్గుణంబులచేఁ బేరుపొందిన సుందరు లెన్నఁడైనంజనించిరా? యని ప్రస్తావవశంబున నడిగిన గోణికాపుత్రుండు నవ్వుచు మీరుపుట్ట లేదా ! మీకన్ననుత్తము లెవ్వరనిపలికిన , నక్కలికి చాలుచాలు మా మాటయే చెప్పవలయునా పరిహాసమాడక నిజముచెప్పుఁడని ప్రార్థించిన నతండు చింతామణియను వేశ్య లీలాశుకుండను బాహ్మణుని భర్తగా వరించి ముక్తినొందినకథ జగద్వితమైయున్నది. మీరు విన