పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

చింతము నీవన్నిటంబ్రౌఢురాలవు. నీకు మేము చెప్పనక్కరలేదు కార్యభారము నీదేయనిపలుకుచు దారిభత్యమునకని కొన్నిదీనారము లామెచేతిలోఁబెట్టి చేయవలసినకృత్యములు బోధించి యంపెను.

గోణికాపుత్రుం డాయూరువిడిచి దేశవిశేషంబులఁ జూచుచు మెల్లగాఁబోవుచుండుటంబట్టి పదిదినములలో నొకగ్రామములో నా యోగిని వారింగలిసికొనినది. అతండామెను బల్కరింపక మారుమొగము వెట్టుటయు నామెయే విద్వాంసుడా! నాపైనీకుఁగోపమా? నే నేమిపాపముజేసితిని. తలఁచితలఁచి నిలువలేక క్రమ్మర మీపాటవినుటకై వచ్చితిని. ఒక్కసారిపాడింపవా? అనుటయు నతండు నీకేమియుఁ బనిపాటలులేవు ఎవ్వరోయింతభిక్షమిడినఁదృప్తిగా భుజింతువు. సంగీతము వినకేమిచేయుదువు? పో. పొమ్ము. ఇందుపాడువారులేరని గద్దించి పలికిన నలుగక యామె బాబూ! నీవు నన్నుఁదిట్టినను నొప్పుకొందు కొట్టినను నంగీకరింతు. పాడించినంజాలని బలుకుచు వారినివిడువక వెనువెంటఁదిరుఁగుచుండెను. ఒకనాఁడు గోణికాపుత్రుఁ డెందోపోయిన నాయవకాశము కనుపెట్టి యాయోగిని వారితో నేకాంతముగా నిట్లనియె.

బిడ్డలారా! మిమ్ము నేను గురుతుపట్టితిని. మీరు రతినూపుర పుత్రికలు. మీరుగన్మొఱంగివచ్చితిరి. మీనిమిత్తము మీతల్లిమంచము పట్టినది పెద్దదానినేడిపించుట మీకుఁదగదు. అది యట్లుండె మీకొక శుభోదర్క మెఱింగింపవచ్చితిని. వినుండు విపులుఁడను మహారాజుకడ మీవిద్యారూపశీలాదులఁ బొగడితిని అతండు మిమ్ము జేపట్టుటకు సిద్ధముగానున్నాఁడు అతనియైశ్వర్యమంతయు మీయధీనము చేయఁగలఁడు నాతోరండు మిమ్మతనితోఁ గలిపెద. ఈముష్టిపాఱునివెంటఁ బడితిరేల? ఇదియేటియూహ! అనిపలికినవిని చిత్రసేన చురచురంజూచుచునిట్లనియె.

ఓసీ! దుష్టయోగినీ! ఇదియా? నీవేదాంతము! వేషమునకే