పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మతంగయోగినికథ.

91

పాడుచుండ వింటిని. మఱియెక్కడ వినలేదు. ఇంత మనోహరముగాఁ బాడువారరుదు. అని స్తుతియించుచు మఱియొకపదము మఱియొకగీతము అనికొసరుచు, నత్తన్వి పాడుచుండ శిరఃకంపము చేయుచు నాలించినది. అప్పుడు గోణికాపుత్రుడు సాక్షేపముగా నవధూతా ! నీచిత్తము పరబ్రహ్మయత్తమైనదా? తురీయానంద మనుభవించితివా? ఇఁక చాలునా? అని యడిగిన నామె బాబూ! నేనెన్నినాళ్ళు వినినను వినఁగలను, ఇందులకు నాకుఁదృప్తి లేదు. నిద్రాహారములు విడిచి వినగలను. అనుటయు నతండు నవ్వుచు నీవు వినఁగలవుగాని పాడువారికి నోపిక యుండవలదా? ఇప్పుడు వేదాంతివిగదా యని యితఁడుపాడెను గాని యిఁక యూరకపాడఁడు విత్తముజూపినంగాని వీణ విప్పడు ఇఁక నీదారిని నీవుబొమ్ము. అనుటయు నామె యిట్లనియె.

బాబూ ! నేనొరుల నెప్పుడు కష్టపెట్టను నానిమిత్తమై పాడ నక్కరలేదు. మీరు పాడినప్పుడే విని యానందించెద మీతోవచ్చుట కంగీకరింతురా? అనిన నతండు నీవు మాతో రావలదు. నీదారిని నీవు బొమ్ము. నీవు యోగినివి మేము భోగులము అని కచ్చితముగా నుత్తరము జెప్పెను.

అప్పుడాయోగిని యించుకసిగ్గుపడుచు దిగ్గున విపులునొద్దకుఁ బోయి మహారాజా ! వాండ్రు రతినూపుర పుత్రికలే. పురుషవేషములు వైచి తీసికొనిపోవుచున్నాఁడు. ఆబాహ్మణుఁడు కడుగడుసు వాఁడు. నన్నుఁ దమతో రావద్దని నిరసించెను. పాపము రతీనూపుర యిరువురఁ గూతుండ్రను మీకిచ్చుటకు సిద్ధముగానున్నది. ఇప్పుడు మనముచేయందగినపని యేమని యడిగిన విపులుండిట్లనియె.

దేవీ ! నీవు వారింగలసికొని పురుషుఁడువినకుండ మదీయప్రాభవవిద్యాలీలాదులఁబొగడి కార్యమెఱింగించి తీసికొనిరమ్ము. నీవు చెప్పిన దప్పకవత్తురనియే నాఅభిప్రాయము రానినాఁడు వేరొక తెరు వాలో