పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మతంగయోగినికథ.

89

భోగినీ ప్రవృత్తులు లెస్సగా నెఱుంగుదువు ? వైరాగ్యంబునంగాక శృంగారంబునంగూడనీకభినివేశము గలిగియున్నది. మహాత్ములులోకోపకారమునకై పాటుపడుచుందురు. త్రికరణంబుల భూతప్రీతి గోరువారే యుత్తములు. నన్ను నీశిష్యునిగా భావించి యామించుఁబోఁడుల నాకుఁ బెండ్లిగావింపుము. నీయుపకార మెన్నటికి మఱువనని ప్రార్ధించెను.

నాకు నీకూఁతుండ్రయందుఁగల యనురాగముచే గహిన్‌తకృత్యమైనను దౌత్యమున కనుమోదించితిని. తదామంత్రణంబు వడసి యిక్కడకుఁ బరమోత్సాహముతో వచ్చితిని. ఏమిలాభము ? నాప్రయాసమంతయు వ్యర్ధమైనది. అని పలికిన రతిసూపుర, దేవీ! నాకూఁతుండ్రు దాసరులై యూరరం దిరుగునట్లు నొసట వ్రాసియుండఁ జక్రవర్తి కెట్లు భార్యలగుదురు? కోరికోరి చివరకు విభూతిరాయలఁ గోరిరి. అదియే నామనం బెఱియుచున్నది, నేనేమి చేయుదును ? నీకు శక్తియుండిన వారిని వెదకిపట్టి తీసికొనివచ్చి యాఱేనికిఁ గట్టిపెట్టుము. నీవు నిజముగాఁ దలంచినపనియేల కొనసాగకుండెడిని ? అని కోరిన విని యాయవధూత శిరఃకంపమున నంగీకారము సూచించుచుఁ గొన్నియానవాళ్ళు తీసికొని బయలుదేరి వారల జాడలు దెలిసికొనుచు గొన్నినాళ్ళు దేశసంచారము గావించినది. కాంతలు కనకమువంటివారు కాంతాకనకంబు లొంటిగా లభించెనేని యనుభవింపవలయునని యెట్టి వారికిని బుద్ధిపుట్టక మానదు. అని తలఁచి గోణికాపుత్రుండా గణికానందనలఁ బురుషవేషమువైచి ధారానగరంబునకుఁ దీసికొనిపోవుచుండెను. మహాపురంబున నొకసత్రంబున వారు బసజేసియుండగా మతంగయోగిని యక్కడికి బోయి నలుమూలలు వెదకుచుండెను.

చిత్రసేన యామెంగురుతుపట్టి గోణికాపుత్రునితో నార్యా ! యీయోగిని యప్పుడప్పుడు మాయింటికి వచ్చుచుండునది. మాతల్లికి