పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

కాశీమజిలీకథలు - మూడవభాగము

చిన్నదానిని వ్రాసి మీకును మాకును దేశభేదము గలుగుటచే నాచారభేదము గలిగి యున్నది. కావున బెండ్లియాడుటకు వీలులేదని సూచించెను.

తరువాత నానాతి నే నిన్నువరించితిననియు నీవు బెండ్లియాడకుండినచో విరహవేదనంజెంది మృతినొందుదుననియుం దెలుపుచు అతని రూపు వ్రాసి దానిం గౌగలించుకొని అధరరసం బానుచున్నట్లు తన రూపమును వ్రాసినది.

ఆసంజ్ఞ గ్రహించి కందర్పుడయ్యో! యిదియేమికర్మము? ఈచిన్నది యొంటిగావచ్చి నన్ను నిర్భంధించుచున్నది దీనియాప్తు లెవ్వరేని చూచిరేని ప్రమాదము. అదియునుంగాక తన్ను బెండ్లియాడుమనికూడ సూచించుచున్నది ఈపని కెట్లొడంబడుదును వీరేజాతివారో తెలియదు. స్వజాతినాతిం పెండ్లి యాడినంగాని అన్యజాతి యువతిం బెండ్లియాడగూడదు రెండవభార్యగా స్వీకరింతునని సుభద్రతో బ్రమాణికము చేసియుంటి అది అట్లుండె స్వదేశము విడిచి ఈదేశములో నుండుమనికూడ నిచ్చేడియ సూచించుచున్నది. ఈ నిబంధనము లేమియు నాయుల్లమున కెక్కుటలేదు. ఈపడతికి గోపము వచ్చిన వచ్చుగాక. వివాహమాడుటకు సమ్మతింపనని నిశ్చయించి యాయభిప్రాయము పటమున వ్రాసి చూపెను.

అప్పుడచిన్నదానికి మిక్కిలి కోపము వచ్చి నీ కంఠమును దఱిగింతును చూడుమని తెలియునట్లు వ్రాసి అంతలో నాగదిలోనుండి లేచిపోయినది

పిమ్మట నా రాజకుమారుడు పెక్కు తెరంగులదలపోయుచునిద్రబోవక ఎట్టకే నా రాత్రి వేగించెను. ప్రాతఃకాలమున అయ్యధికారివచ్చి అతని బరామర్శించి అతని ఉపచారములకై పరిచారకులను నియోగించి దాను బండియెక్కి విహారార్థ మరిగెను.

ఆ చిన్నది యాపాచకులంజూచి యోరీ! రాత్రి తీసికొని వెళ్ళిన పదార్థములలో నా క్రొత్తవాడెద్ది ప్రియముగా భుజించెనో చెప్పుడు. యిప్పుడు దాని వెండియు అమరింతు ననుటయు భుక్తశేషపదార్ధములు బానిసలకే కనుక తాము కుడువచుచ్చు నను తలంపుతో అమ్మా! ఆయనకు మద్యము మిక్కిలి యిష్టము రాత్రి బ్రీతిగా బుచ్చుకొనియెనని చెప్పిరి.

మాటనిజమని తలంచి యాచిన్నది అతని కాపుట బెందలకడ నాహారపదార్థముల బంపుచు మద్యపాత్రలో విషము గలిపినది. ఆహా! ఆదేశస్త్రీ లెంతధూర్తులో. అసమ్మతము తప్పునా. పాత్రలన్నియు రాత్రివలెనే పావకుడు బల్లమీద పెట్టెను కాని వానిలో నొక్కదాని దడవక కందర్పుడు పాలు మాత్రము ముట్టుకొని తాను తెచ్చుకొన్న పదార్థములే భుజించి యాకలి నడంచుకొనియెను.

అప్పుడవి అన్నియు నాపరిచారకులే తీసికొనిపోయిరి ఇంతలో దమ అధికారి వీథినుండి వచ్చెను. అతనికి భోజన మమరించు సమయమున మద్యపాత్ర పగిలి అందున్న మద్యము భూమిమీద బడినది. దానికి మాదకారుడు జడియుచు అది