పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(11)

చండిక కథ

89

మిక్కిలి వెరఁగుపడుచు గాజుదీపముల యంత్రవిశేషముల కచ్చెరువందుచు నొకపీఠంబున గూర్చుండి తనరాకను గుఱించి యాలోచించుచుండెను.

ఇంతలో అందున్నబల్ల మీద వ్రాతసామగ్రి యుండుటజూచి కుంచికంగొని రంగులతో నొక పటముమీద దనదేశమును వ్రాసి అందొక సభయునందు దాను సింహానసమున గూర్చున్నట్లును పరివారము చుట్టును పరివేష్టించి యున్నట్లును చక్కగా వ్రాసెను. మఱికొంతసేపటికి వేఱొక పరిచారకుడు మాంసము మద్యము మొదలైన భోజనపదార్దముల దెచ్చి అందున్న బల్లమీదనుంచి భుజింపుమని సన్నఁ జేసెను.

అప్పు డతండు అయ్యో! ఈదేశమున నాచారనియమము లేనట్లున్నది. పాదప్రక్షాళనము చేయక సంధ్యావందనము గావింపక మడి గట్టుకొనక యెట్లుభుజింతును ఈ బట్టలతో నాహారమెట్లు సైచును సీ! గర్హితమైన భోజనము నేను గావింపను. ఇదియునుంగాక వీరికులమెద్దియో తెలియదు. నాయొద్దనున్న పదార్థములే భుజియించెదనని తలంచుచు అందు తెచ్చియుంచిన వానిలో బాలుమాత్రము పుచ్చుకొని తానుదెచ్చిన ఫలాదికమును దిని యాకలి నడంచుకొనియెను. తరువాత నాపరిచారకుడు మిగిలినపదార్థములన్నియు వెండియుం దీసికొనిపోయెను. మఱికొంతసేపునకు నొకయింతి యాగదిలోనికి వచ్చినది. ఆచిన్నదానం గురుతుపట్టి తాను పీఠమునుండి లేచి కందర్పుడు సంభ్రమముతో నేమి చేయవలయునో తెలియక యూరక నిలువంబడి చూచుచుండెను.

అప్పు డాపడతి ఆతని గూర్చుండుమని హస్తసంజ్ఞచేసి తానొకపీఠముపై గూర్చుండి సంతుష్టిగా భుజించితివా? అని సంజ్ఞచేయగా నతండు తలయూచి శరీరము నడంక ధైర్యముదెచ్చుకొని యామెకు నమస్కారము జేసెను.

ఆక్కేలుమోడ్పు సాంకేతికమెట్టిదో తెలియక, యాచిన్నది నవ్వుచు నీది యేదేశము పట్టణములోని కెట్లువచ్చితివి? నీవృత్తాంతమేమని సంజ్ఞాపూర్వకముగా నడిగినది.

ఆభాష అతనికి గొంచెము కొంచెము గురుతు తెలియుచుండెను. కావున నా మాట లర్థముజేసికొని తానువ్రాసిన చిత్రపట మా యింతికింజూపుచు నందున్నవాడ నేనేనని తెలియునట్లు సంజ్ఞచేసెను.

ఆ చిత్రపటమునుజూచి యాచిగురుబోడి వెరగుపడుచు నతని నొకదేశప్రభుఁవుగా దెలిసికొని యప్పటమును బలుమారు చూచుచు దలయూచుచు నప్పుడందున్న వేఱొకపటము గైకొని అందతని రూపమువ్రాసి అతనిప్రక్కను తనరూపము వ్రాసికొని అతనికిం జూపినది.

ఆ సంజ్ఞ గ్రహించి యారాజకుమారుడు మరల తానొక యువకునిరూపము వ్రాసి తన దేశస్త్రీని స్వదేశాలంకారముతో దనప్రక్క -------------------