పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చండిక కథ

91

గుప్తముచేసి కందర్పునికై అమరించినది తాము దాచుకొన్న దైనను యజమానుని వలన మాట వచ్చునను వెరపుతో దెచ్చి అమరించుటయు అందు విషము గలిగి ఉన్నదని తెలియదుగావున దొందరగా దానింద్రావి విశ్రమించినంత నాయధికారి యమలోకమున కతిథియై అరిగెను.

కొంతసేపటికి అతండు శయ్య పై జచ్చియుండుట దెలిసికొని పరిచారకులు గుండెలు బాదుకొనుచు నేడువదొడంగిరి. ఆయల్లరి విని యాచిన్నదియు ఆతని భార్యయు బంధువులు వచ్చి పరీక్షించి మృతి నొందుటకు గారణ మరయక అడలజొచ్చిరి. ఇంతలో రాజవైద్యులు రాజభటులు వచ్చి పరీక్షించిరి. ఆ చిన్నది యా యజమానినికి మరదలు తనబావ మృతిని గురించి మిక్కిలి శోకించుచు గందర్పున కిచ్చిన విషప్రయోగ మెట్లో యితనికిం దగినదని యూహించియు బయలు పరుపక కందర్పునిమీద నీనేరము త్రోసివేయవలయునని తలంచుచుండెను. ఇంతలో నా వైద్యులు అతడు భుజించిన పాత్రలన్నియు శోధించి మద్యపాత్రయందు విషమున్నట్లు కనిపెట్టిరి. అప్పుడు తలవరి మొదలగువా రాయింటిలో నున్నవారినందరిని విమర్శింపుచుండ నాచిన్నది పరిచారకులతో మంతనమాడి యానేరము కందర్పుని మీద బెట్టుడని నియోగించినది.

అప్పుడా పరిచారకులు తలవరియొద్ద నిలువంబడి అయ్యా! రాత్రి విదేశస్థు డొక్కడు మా యజమానిచేత నాహూతుండై సత్కరింపబడెను. వానికీదినమున మేము భోజన పదార్ధములు తీసికొని వెళ్ళి బల్లమీద నుంచితిమి. అవి అన్నియు నతండు భుజించి మద్యము మాత్రము పుచ్చుకొనక దానిలో నెద్దియోకలిపి యిది మీ యజమానుని కియ్యుడు. దీనియందు సిద్ధరసము గలిపితిని. మంచిరుచిగా నుండునని చెప్పెను. ఆ మాటలు నిక్కువ మని మేమాపాత్రను దీసికొనిపోయి యాయన భోజనపు బల్లమీద నుంచితిమి. దానింగ్రోలి అతండిట్లయ్యెను. క్రొత్తవాని కులశీలనామంబులు తెలిసికొనక యింటికి దీసికొని వచ్చినందులకు మంచి యపకృతి గావించినాడని ఆతని నిందింపం దొడంగిరి.

అప్పుడు తలవరి అంతకు ముందటిదినమం దతని నెఱగి ఉన్నవాడుగావున గందర్పుని నిందించుచు బట్టించి చేతులకు గొలుసులు తగిలించి బందీగృహంబునకుం దీసుకొనిపోయెను. అప్పుడావార్త పట్టణమంతయు వ్యాపించినది. కందర్పుని నందరు గృతఘ్నుండని తిట్టదొడంగిరి. నిజ మెవ్వరి కెఱుక. కందర్పు డాయధికారి చావునకు బంధువుడులోలె నాత్మగతంబున వగచుచు దన్నిమిత్తమున దన్నుబద్దుజేసిరని తెలిసికొని చింతింపక కానిమ్ము! నిజమున దైవముండక మానడు అట్లుకాక ఇది మదీయ పురాకృతదుష్కృతమే యైనచో దప్పక అనుభవింపపలసినదేకదా? వీరి భాష నాకు వచ్చినచో నెద్దియేనిం జెప్పుకొందును? మాట వచ్చినను మూగవాడనైతినని అనేక ప్రకారముల దలంచుచు నాకారాగృహంబున నుండెను. మఱియొకనాడు సాక్షులతోగూడ గందర్పుని రాజసభకు దీసికొనిపోయి తలవరి అతని నేరము చేసిన