పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

కాశీమజిలీకథలు - మూడవభాగము

నతండు వెరగుపడుచు నతనిం బల్కరించిన గందర్పుడు మునుపటివలెనే తనజింకను బుచ్చుకొని తన్నన్యాయముగా బట్టుకొనిరని సంజ్ఞలచే సూచనజేసెను. వానిమాట లేమియు నర్థముకాలేదు. గాని తదీయరూపలావణ్యాది విశేషములఁ జూడ నతని కించుకజాలి బొడమినకతంబున దన బండిమీదనున్న యొక చిన్నదానిని తనదాపునకుఁజీరి యావింతపురుషునిం జూచితివా అని అడిగెను.

ఆ కాంత కందర్పునింజూచి విస్మయమందుచు అయ్యో! పాపమితడే దేశస్థుడో తెలియదు. మనదేశపు చట్టముల నెఱుగునో యెఱుగడో? ఇంతమాత్రము నేరమునకే వీని నిట్లు చెరసాలం బెట్టవలయునా? వీని ముఖవర్చస్సుచూడ గౌరవ కుటుంబములోనివాడుగా దోచుచున్నవాడు. వీనికి నేను బూటగానుండెద. వీని విడిపింపుడు. వీన మనయింటికి దీసికొనిపోయి నిజమైన వృత్తాంతము దెలిసికొని పిమ్మట నేరము విధింపవచ్చునని చెప్పగా అయ్యధికారి సమ్మతించి యాతలవరి కట్టిపత్రిక వ్రాసియిచ్చి వాని బైకి రప్పించి తమబండి యెక్కుమని సంజ్ఞచేసిరి.

కందర్పుడు వారి సంజ్ఞ గ్రహించి అయ్యో! ప్రాయములోనున్న యాచిన్నదానిప్రక్కన నన్ను గూర్చుండుమని వీరు సూచించుచున్నారు. ఈదేశమున స్త్రీలకు రాణివాసము లేదుకాబోలు. ఈనెలంత సౌందర్యవతికాని సామాన్య కాదు. కానిమ్ము! స్త్రీలలోనంగాని దేశమర్యాదలు దెలియవు నన్ను విడిపించిన యిప్పుణ్యాత్ములతో బోయి కృతజ్ఞత చూపించుకొనియెద ఆ కారణముగా వీనికి నాయందక్కర గలిగినది ఏ దేశమందైనను ధర్మాత్ములుండక మానరని తలంచుచున్న సమయంబున ద్వరగా బండియెక్కుమని తలవరి తొందరజేసెను.

అప్పుడు నాజింక నిచ్చినంగాని నే నెక్కుటకు సమ్మతింపనని కందర్పుడు సూచనచేయగా నాసంగతి యాఅధికారి తెలిసికొని యాతోలు నిచ్చుటకు వీలులేదనియు దరువాత నిత్తుననయు, అతనికిఁ దెలియునట్లు తలవరిచేతనే సంజ్ఞచేయించుటచే నాసన్న గ్రహించి స్త్రీసమక్షమున వసియించుటకు వెఱచుచు బలవంతముమీద నాబండియెక్కి వారికెదురుగా గూర్చుండెను.

అంతట నాబండివాడు గుఱ్ఱము నతివేగముగా దోలుటయు ముహూర్తమాత్రములో నాబండియొక మేడదాపునకు లాగికొనిపోయి నిలిచినది. బండియాగినతోడనే యా అధికారియు నాచిన్నదియుందిగి కందర్పునిం దిగుమని సంజ్ఞచేయగా అతండును వారితో దిగి యాయింటి అలంకారవిశేషము లబ్బురముగా జూడదొడంగెను.

అప్పటికి గొంచెము చీకటిపడినది. అప్పుడాయింటిలోనుండి కొందరు పరిచారకులు బండిదగ్గరకు వచ్చిరి. వారిలో నొకనిం జీరి అధికారి క్రొత్తవానిం జూపుచు నెద్దియా చెప్పెను. అప్పుడా పరిచారకుడు కందర్పుని దనవెంటరమ్మని సంజ్ఞ చేయుచు అతని అమ్మేడమీదనున్న యొకగదిలోనికి దీసికొనిపోయి కూర్చుండ బెట్టెను.

ఆగదిలోనున్న అలంకారములతీ రంతకుము న్నతండు చూచియుండనందున