పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవకుబేరుని కథ

307

మున కెట్లు సహాయము చేయుదురు. ఇతని బుద్ధిహీనత యిప్పుడు స్పష్టమగుచున్నదికదా! తానుచేసిన సుకృతముతప్ప తన్ను కాపాడువారు లేరు. కావున నొరులకొరకుఁ దనదారిఁ జెరుపుకొనరాదు. సంవత్సరమునుండి నాకొక స్వయంపాక మియ్యవలయునని యెన్నియోపాట్లు పడెను. ఇట్టి లుబ్ధునకుఁ జివర జరిగిన పని యిది. తానైనం గొనిపోవుచున్నాడా! ప్రోగుచేసి మీకిచ్చిన మీ కృతజ్ఞత యిట్లున్నది కానిండు సంవత్సరమునుండి నాకు వీనిసాంగత్యము గలుగుచున్నది. మీరు కృతఘ్నులు కావున వీనిం కాపాడితిరికారు నేను దీనింగ్రోలి వీనిం బ్రతికించెదఁ జూడుడని పలుకుచు నాపాత్రలోనున్న పాలుద్రావి నావీపు తట్టుచు వర్తకుడా? లెమ్ము లెమ్ము సిద్దరసాయంబున బ్రాణంబు లిచ్చితినని పలికిన నేనప్పుడు ముసుగుతీసి వారిమాటలన్నియు వినుచుంటిని కావున నందరయందును విరక్తి జనింప లేచి కూర్చుంటిని.

అప్పుడు నాబంధువులందఱు నన్నుఁ జుట్టుకొని యేడువఁదొడంగిరి. నేను ఛీ! ఛీ! పోపొండు యీదొంగరోదన మేల సేసెదరు. మీ ప్రీతియంతయుం దెల్లమైనది. మీకతంబున నే నధోగతిం బడుచుండ నీమహానుభావుం డుద్ధరించెను. నిక్కము తెలిసికొంటి నెవ్వరి కెవ్వరును లేరు. ఎవ్వరులేరు. ఇదియంతయు వట్టిదియని పలుకుచు నాబంధువుల నందఱిని విడిచి యప్పుడే నా ధనమంతయు శ్రోత్రియులకుఁ బంచిపెట్టి యయ్యోగి పాదంబులు శరణంబులుగా వేడికొనుచు నతనితో దేశాటనము చేయుటకు పూనుకొంటిని. కాని యయ్మోగి యమ్మఱునాఁడుదయంబున నాకు తెలియకుండ నెచ్చటికో చనియెను నే నతనిజాడ నరయుచు నెవ్వరి కెవ్వరును లేరనుమాటతప్ప మఱియేమియుం బలుకక వెఱ్ఱివాడనై యనేక విశేషములం గంటిని. ఒక్కచో వీరిరువురు గనంబడుటయు నావంటివారేకదా యని నాటగోలె వీరివెనువెంట తిరుగుచుంటిని. తదనంతర వృత్తాంతము మీరెఱింగినదేకదా యని తన కథయతంయు జెప్పి యా వర్తకుడు వారికి విస్మయంబు కలుగచేసెను.

తచ్చారిత్రములు విని చక్రవర్తి విక్రమార్కునితో నార్యా అమ్మహాయోగి తాను జదివిన పద్యమునంగల విషయములు ప్రత్యక్షముగా నాకిట్లు చూపెను. అమ్మహాత్ముని భగవంతుడనియే నిశ్చయింపఁదగినది ఒరుల కిట్టిసామర్థ్యము గలుగునాయని పొగడుచు మంత్రి దిక్కు మొగంబయి విజయవర్దనా! ఈ బ్రాహ్మణుడును వర్తకుడు నాకత్యంత ప్రాణమిత్రులై నాతోఁ గష్టసుఖంబుల ననుభవించిరి. వీరికి ముందుగా మేలుగూర్పవలయును. దేవశర్మ నీరాజ్యమునకు బట్టభద్రునిగాఁ జేసి యీవర్తకుని మంత్రిగాఁ జేయుము. వీరు కారణాంతరమున నావలెనే విరక్తులైరి. కావున వెండియు సుఖంబులం గుడువనోపుదురు. శ్రోత్రియ బ్రాహ్మణ పుత్రికను నితనికి పెండ్లి చేయుమని యాజ్ఞాపించుచున్న యన్నరపతి ముఖ్యునితో విక్రమార్కుం డిట్లనియె.

దేవా! దేవరయానతి యెంతయు నుచితముగా నున్నది. ఉత్తమాంగన లోక