పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

306

కాశీమజిలీకథలు - మూడవభాగము

ఈతని కాయువుమూడినది. కావున నితడిట్లు మృత్యుండయ్యెను. ఈసిద్దౌషధ బెవ్వరు పుచ్చుకొనునో యతండు మృతుండగును. ఆతని యాయువు వీనియందు సంక్రమించి యితండు బ్రుతుకును. ఇదియే యీసిద్దౌషధివలన గలిగెడు గుణము. దీనిని మీలో నొక్కడు త్రాగుడు వీడు జీవించును. వీడు చేయగల కార్యములన్నియు దీరగలవని పలికి యూరకుండెను.

అతనిమాటలువిని నా బంధువులలో నొక్కండయినను నేను త్రాగెదనని ముందరికి వచ్చినవాడులేడు. అప్పుడా యోగి తిరుగా నామాటలే చెప్పెను కాని యెవ్వరు నేమాటయు చెప్పిరికారు. కొంతసేప ట్లూరకొని యాసిద్దుడు నా భార్య జీరి నారీమణీ! స్త్రీలకు బతియే భూషణము. పతితో మృతినొందిన యువతి ఏడుతరముల నుద్థరించును. పతివిహీనయైన స్త్రీ జీవించుటకంటె బాతకములేదు నీకును సగంకాలం తీరినది. సంతతిం బడసితివి. శుభములంజూచితివి నీకు గొదువయేమియునులేదు. నీ వీసిద్దౌషధమును ద్రాగుము పతిని బ్రతికించిన పుణ్యమునుజెంది యుత్తమలోకంబున కరిగెదవని పలికిన నాభార్య యామాట కేమియు నుత్తరమియ్యక మెల్లగా నావలకు జారినది.

ఆతం డంతటితో నూరకొనక యేమమ్మా? మాటాడక యవ్వలికిబోయితివి నామాట కేమియుత్తర మిచ్చితివి? ప్రాణనాథుని కీపాటి యుపకృతి సేయలేవాయని పలికిన నాదుష్టురాలు యెదుటకు రాక మాటుననుండి అయ్యో ఇదియేమికర్మము ఇందరిలో సిద్ధునకు జావుమనుటకు నేను గనంబడితిని కాబోలు నేను జచ్చిన తరువాత నెవ్వరుండిన నాకేమి? చాలు నీవైద్యమని మెల్లగా బలుకుచు నచ్చటనుండి కదలినది కాదు.

అప్పు డతండు విడువక నాభార్యచేత నేను జావజాలను. పుణ్యము నాకక్కర లేదు. ఈ సిద్దౌషదమును నేను బుచ్చుకొననని ముమ్మారు స్పష్టముగా బలికించెను. ఆసందడిలో నందున్న బంధువులు నెపములుపన్ని యందుండి యవ్వలికి బోదొడంగిరి. అది యంతయు దువ్వలువ సందునుండి జూచుచునే యుంటివి. అయ్యోగి నా భార్యను విడిచి నాపెద్దకుమారుని జీరి దాని నడిగినట్లుగానే యడిగెను. వాడును సమ్మతింపడయ్యె ఇక జెప్పనేల? నాకుగల కొడుకులను, కోడండ్రను, కూతుండ్రను, మనుమలను, నాప్తులను, బరిచారకులను దాసదాసి జనంబులనతండు నందరను బేరు పేరు వరుస నారీతిగానే యడిగెను కాని యొక్కడయిన సమ్మతించినవాడులేడు

అప్పుడతండయ్యో ఈతని కిందఱు ప్రాణబంధువులు గలిగియుండి యొక్కడయిన వీనిప్రాణములు కాపాడకపోయెను. ఈతండు వీండ్రకొరకు చేయరాని పనులన్నియుంజేసెను. ద్రోహబుద్ధితో బెక్కురొక్కము సంపాదించెను దానధర్మములను మాటయే ఎరుంగడు. కుడుచుటయు, దొడుగుటయు, నిచ్చుటయు మునుపేలేవు. ఇట్టి పాపకృత్యములన్నియు వీరికొఱకు కావించి ద్రవ్యము కొఱంతపడనీయక కాపాడుచుండెను. ఇట్టివాని విషయమై యైహికమునకయిన నడ్డుపడకున్నారు. పర