పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

248

కాశీమజిలీకథలు - మూడవభాగము

ముగా నాకావిద్యయంతయుఁ బట్టుబడినది. నాయందు నమ్ముకకలిగి యారెడ్డి నాబుద్ధి సూక్ష్మత కనిపెట్టి నన్నుగూడ చౌర్యమునకు దగినవారితో నంపిన నేనును నైపుణ్యముగా గన్నములువైచి బంగారును వెండియు దస్కరించి తెచ్చి యా రెడ్డి కిచ్చువాడను. దొంగతనమువంటి లాభకరమయినపని మఱియొకటిలేదుకదా!

ఇట్లు తస్కరుండనై వానియింటం గొన్ని దినంబులు వసించితిని. ఆరెడ్డికి రుచిరయను కూతురుగలదు. పదియారేడుల ప్రాయముగల యాచిన్నదానిని నారెడ్డి తన మేనల్లునకిచ్చి వివాహము సేయ బ్రయత్నింపుచుండగా నాయువతి నాయందు బద్ధానురాగయై తన మనోరథము నాకెఱింగించినది. నేనును సంతసించుచు నమ్మించుబోడితో రహస్యముగా గ్రీడింపుచుంటిని.

ఇంతలో నక్కన్యకు వివాహముహూర్తము సమీపించినంత మేమిరువురము నాలోచించుకొని యొకనాడర్ధరాత్రంబున మణిభూషణాంబరములు కొన్ని సంగ్రహించుకొని యెవ్వరికి దెలియకుండ నరణ్యమార్గంబునంబడి పాఱిబోయితిమి రుచిర తస్కరవిద్యలో మిక్కిలి గడిదేరినదగుటచే నాయరణ్యములో నడుచునప్పు డించుకేనియు నాయాసముబూనక లాఘవముగా నడకలో నన్నే యాక్షేపించునది. ఆరీతి బోవుచు గ్రమంబున ననేక జనపదములంగడచి యొకనాడు రాత్రి కీయూరు సేరితిమి.

ఈ వీటిలో నేనాబోటితో గొన్నిదినంబులు రాత్రింబగళ్ళు వివక్షత తెలియకుండ సుమశరక్రీడాకౌశలంబున మెరయ హాయిగా గాలక్షేపము జేసితిని. మేము తెచ్చినసొమ్ము స్వేచ్చగా వ్యయపెట్టుచుండ నెలదినములకు సరిపడినది. తరువాత సొమ్ములేక నేను విచారింపుచుండ రుచిర నన్ను జూచి యెకిమీడా! మనయిరువురకు జోరవిద్యచక్కగా దెలిసియున్నది. కన్నము త్రవ్వితిరేని లోనికింబోయి యెంత భద్రముగా దాచిన వస్తువులయిన సంగ్రహించి తేగలను. దీనికై మీరింత చింతింప నేల? పెక్కులేల? నేడమవస ఈ రాత్రియే యీ పట్టణము రాజుగారి ఇంటికి బోవుదమురండని బోధించిన నేను సంతసించుచు జీఁకటిపడినతోడనే మేమెల్ల మసిబూసుకొని సమురు బ్రామి కాసికోకలు బిగియించి చౌర్యసాధనంబుల గైకొనిపోయి యా కోటగోడ లాఘవముతో లంఘింఛి భవనాంతరము లరసి సౌధంబులెక్కి గదులు విమర్శించి వెదకి వెదకి విక్రమార్క మహారాజు శయనించియున్న యంతఃపురమునకు గన్నమువైచి లోపల ప్రవేశించితిమి.

అట్టి సమయమున విక్రమార్కునితో భార్య యెద్దియో ప్రస్తావించుచు దేవా? దేవకిరాతకజౌర్యమర్మము లన్నియుం దెలియునని చెప్పితిరి. ఎరిగిన వారికైనను దాము దాచినవస్తువులను దీపము లేని ఇంటిలో దెలిసికొనుట కష్టము దొంగలుపెక్కు చిక్కు గల రహస్యస్థలములో ప్రవేసించి చీకటిలోనున్న వస్తువుల నతిలాఘవముగా సంగ్రహింతురు. ఇది యెట్టిశక్తి యనియడిగిన నమ్మహారాజు నవ్వుచు జవ్వనీ! అదియే తస్కరశక్తి అది యంజనప్రభావము. ఇప్పటి కాలములో నట్టి ప్రభా