పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[3]

సునీతి కథ

25

డగు. దీసికొనిపోయి వేగమ అట్లు చేయి౦పుము. ఇది దేవతాసిద్ధౌషధము. సునీతి నీతిమతి నెఱింగి యిచ్చితివి కాని సామాన్యుల కియ్యనని పలుకుచు నన్ను గౌరవించి యంపెను. నేను సంతోషముతోఁ దొందరగా వచ్చితిని. యాలస్యమైన నెండిపోయి పసరురాదు. వేగమట్లు చేయుటకుఁ బ్రయత్నింపుమని పలుకుచు నాయాకుఁ జేతికిచ్చినది.

సునీతియు, సంతసించుచు నాయాకు స్వీకరించి, బోఁటీ! నీకు నాయందుఁ బుత్రికావాత్సల్యము గలిగియున్నది. కావున నింత శ్రమపడితిని. దీనివలన దైవకృపఁ నంతయు జక్కపడెవేని నాయైశ్వర్యమంతయు నీదే సుమీ? యాసిద్ధుం డుత్తముఁడే యని తోచుచున్నది. ద్రవ్యాశలేక యిట్టియుపకారముచేయుట కాతని కేమి అవసరము? కానిమ్ము ఈరాత్రియే అట్టిపని జరిగింపఁ బ్రయత్నింతు మఱియు నేనిదివఱకతని మొగము చూచియుండలేదు. ఈదినమున మాత్రమెట్లు సంఘటిల్లును దీనికుపాయ మేమన అడుగగా భ్రమరికి యిట్లనియె.

అమ్మా! వినుముఁ ఆయన భోజనమున కింటికి వచ్చునుగదా నీయత్తగారి నడిగి ఈరాత్రి నీవు వంటచేయుము. అతను భుజించుసమయుములో సులభముగా నీపసరుమీద జిమ్మవచ్చును. యింతకన్న మఱియొక సాధనములేదని పలుకగా సునీతి ఆయాలోచన మెచ్చుకొని కొంచెము ప్రొద్దుండగనే అత్తగారియొద్ద కరగినది.

రాజపత్నియు, ముద్దుగోడఁలిం దద్దయుగారవించి, సునీతీ! నీవు దారితప్పి యెట్లువచ్చితివి? నీవు వచ్చినది మొదలు మాచిరంజీవి యెప్పుడో నక్షత్రములాగున వచ్చి నిమిషములోఁదిని పోవుచున్నాఁడు. ఇదియంతయుఁ నీనేర్పరితనము. నేఁ డెద్దియో ప్రయోజన ముండక వచ్చుదానవు కావు. పని చెప్పమని అడిగిన అప్పడఁతి యామెకు నమస్కరించుచు మెల్లన నిట్లనియె.

అత్తా! మీరు సర్వజ్ఞులు, మీరెఱుఁగనిది యేమిగలదు? మీకుమారువి సెలవు లేక యేపనియు, జేయరాదుగదా. ఈరాత్రిఁ దనకుఁ బ్రత్యేకము వంటచేయమని చెప్పి పోయిరి. దానికె ముందుగా వచ్చితిని. యిదియే కారణము. ఆయుపకరణము లిప్పింపుఁడు వంటచేయుదును. అని యడుగగా నామె సంతసించుచు నా నారీమణి కోరిక ప్రకారమన్నియు సమరించినది.

సునీతి చక్కగా నలంకరించుకొని యరాత్రి అద్భుతమైన రుచులు వెలయఁ బెక్కు పిండివంటలతోఁ బాకముజేసి పతిరాక నిరీక్షించి యుండెను. ఇంతలో నాజయభద్రుఁడు వేశ్యాగృహమునుండి భోజనమున కింటికివచ్చి పాదప్రక్షాళనాదిక్రియలు నిర్వర్తించి పీటయొద్దకు వచ్చునంత నచ్చట వింతగాఁ బాత్రాదికము లమర్పబడియున్నవి. అందులకు వెరగందుచు నాపీటమీఁదఁ గూర్చుండి పాత్రము సవరించుకొనుచు త్వరలో వడ్డింపుడని కేకవైచెను.

అప్పుడా సునీతి, వింతకౌశేయము ధరించి, విభూషలు దీపపుకాంతులఁ దళ్కు