పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

కాశీమజిలీకథలు - మూడవభాగము

వరకు నుత్సవములందు కావింపుచుండిరి. నేను విమర్శింప ద్వీపాంతంరమునుండి యెవ్వడో రాచకుమారుడువచ్చి యాస్వామి కాదినమున భోగము గావింపుచున్నవాడని తెలియవచ్చి నది. ఆ యుత్సవములు చూచుటచే నేను నాదుఃఖము నించుక సేపు మరచితిని. అట్లారాత్రి రెండుయామములు దనుక నాగుడిలో సందడిగా నున్నందున నేనును నిర్భయముగా నందు గాలక్షేపము జేసితిని.

క్రమక్రమముగా జనులు తమతమ నెలవులకు బోయిరి. తరువాత నర్చకులు గుడికి తాళమువైచి యావరణములో నున్నవారినెల్ల బైటకు బొమ్మనిరి. అప్పుడు నేను చావడియరుగుపైకి బోయితిని. చావడిగుమ్మము తలుపులుగూడ బీగమువైచి వారు తమగృహంబునకు బోయిరి. అప్పుడా యరుగుమీద నేనొక్కరితనే యుంటిని. నావెరపునకుదోడు చీకటియు నెక్కుడుగానుండెను. అవీథి మారుమూలగా నుండుటచే తఱుచు జనులా వీథిని బోవరు. ఒక ప్రక్కను కోటగోడ పర్వతమువలె నుండుటచే నచ్చట మఱింత చీకటిగానున్నది.

ఆ యరుగుమీద నొక గదియున్నది. దానికి దలుపులు లేమింజేసి లోపలకు బోవుట కభ్యంతరములేదు, బయట నివసింప భయమయినంత నేనా గదిలోనికిబోయి యొకమూల గూర్చుండి యెప్పుడు తెల్లవారునని భగవంతుని ధ్యానము చేయుచుంటిని.

అట్టిసమయమున మెల్లగా నడుగులిడుచు నొకపల్లవపాణియా గదిలోనికి వచ్చినది. ఆ నాతి మేని యాభరణ కాంతులు నాకన్నులకు మిఱుమిట్లుగొల్పినవి. నగల సోయగము జూచి పార్వతియో, లక్ష్మియోయని భ్రమించితిని. కాని యంతలో భూతభేతాళములు యక్షిణీరూపములతో సంచరింపుచుండునను సంగతి జ్ఞాపకము వచ్చుటచే గుండెపగిలినది. ఆకుమరుంగు పిందెవలె నణంగియుంటిని. గట్టిగానూపిరి విడిచినచో దెలిసికొనునని ప్రాణము లుగ్గబట్టుకొనియుంటిని. అట్టిసమయమున నన్నది నలుమూలలు బరికింపుచు నేనుండుట యరసి నన్ను నిద్రబోవునట్లు తలంచి రామామణీ! యని మెల్లగా బిలిచినది. నాపేరు నాగమణిగాన రామాయను మాట విస్పష్టముగా దెలియక నన్నే పిలుచుచున్నదనుకొని ఓయి యని పలికితిని. అయ్యో! ముందుకువచ్చి నిద్రపోవుచున్నదానవా? గోడదాపున నుందువనుకొంటిని. కోటగోడ దాటుట మిక్కిలి దుర్ఘటమయినది సుమీ! తుదకు దాటలేననుకొంటిని గొలుసు నేలంట దిగినదికాదు. క్రిందనేమియున్న సరేయని దుమికితిని ఇంచుక తప్పినది కదా. యాప్రాంతమునందే నేలనుయ్యియున్నది. దానిలో బడిపోవుదును ------సితినిలే. ఇంతకు దలంచుకొన్నవేళ దాటినదే. కానిమ్ము చెప్పవలసిన యంశములు చాలనున్నవి. వానినన్నియు మార్గములో జెప్పెదను. రాజకుమారుడు వ్రాసినచీటిలో బండి పండ్రెండుగంటలకు సరిగా బంపుదునని యున్నది. ఇప్పుడే గంటలు గొట్టినారు బండివచ్చినదేమో చూడుము అనిచెప్పిన మాటలన్నియు నేను విని యోహో తెలిసినది. ఈచిన్నది యొక రాజకుమారునితో సంకేత మేర్పరచు