పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

కాశీమజిలీకథలు - మూడవభాగము

రామకవి పేదపాఱుం డనుకొంటిమి కాని కాడు. కాడు. ఆయన యాకారము మహనీయత సూచించెడిది. కలికీ నీచక్కని నిక్కము దాపనేల? తల్పగతుండయిన యతని జూడంజూడ నాకేవేడుక పొడమినది. వజ్రమువంటి నాహృదయము నేటికిం దేలికయినది. ఎట్టివానినీ గణియింపని నాచిత్త మితనియందు లగ్నమగుటకు గారణమేమో తెలియదు. ఈతనితో దేశాటనముచేయుచు దిఱిపెమెత్తుకొన విధి నాకు విధించెను గాబోలు వలపు విధి నిషేధంబులం దెలియనీయదుగదా? చెదిరినమతి నతి ప్రయత్నంబున బిగియబట్టితి. నీవేమి చేసితివి? నిక్కము చెప్పుమని యడిగిన నప్పడంతి సిగ్గభినయించుచు నల్లన నిట్లనియె.

చెలియా! మనల నిమిత్తము వీరిరువురం బరమేష్టి సృష్టించినట్లు తలంచెదను. కానిచో వీరితో మనము బీటలపై గూర్చుండుటకు సమ్మతింతుమా? విధి విచిత్ర సంఘటనముల గావింపుచుండును. నేను నీకన్న ప్రౌఢురాలనా యేమి ? నాకు రాత్రి సుభద్రుని యాకారవిలాసము లపూర్వములట్ల తోచినవి. వానినెఱచేసి పూవింటిజూడు విరితూపుల నామది విదళంచెను. చిత్తము మెత్తనైనంత దత్తంముతో దేలికవడికొన కతనికి నా హృదయాభిలాష వెల్లడించితిని ఆతడెంత ధైర్యధనుండో చూడుము. గాంభీర్య మెట్టిదొ బరికింపుము నాచేననిపించుకొనువరకు నాస గొలిపి పిమ్మట నాగురు నానతిలేనిదే యేకార్యము సేయనని నన్ను సిగ్గుపుచ్చెను. ఇందులకు నీవేమనెదవో యని వెరచుచున్నదాననని చెప్పుచున్న సమయంబున రాజపత్ని యచ్చటికి వచ్చి తలుపుగొట్టినది.

ఆమె తలుపుతీసినతోడనే వారి దోడ్కొనిపోయి యిష్టాహారములచే సంతుష్టిం నొందజేసినది మూడురాత్రులు గడిచిన పిమ్మట నాల్గవనాటి యుదయంబున మంగమణి ప్రియంవదతో నిట్లనియె సఖీ! రెండవరాత్రి వృత్తాంతము వినియుంటివిగదా! అంతవరకు గుట్టు నిలుపుకొంటిని. నిన్నటిరాత్రి యెంత యాపుకొనెదమన్నను సారథిని లక్ష్యముచేయని గుఱ్ఱములు బండినిలాగినట్లు నా యింద్రియము లాగినవికావు. సీ! యనంగునివంటి చపలు డెందుననులేడు. నానియమమంతయు నీటగలిపెను. అన్నన్నా! యెంత మోసమువచ్చినది. రామకవివంటి చతురుడీ పుడమిలో లేడు. మంచి నేర్పరి. ఎక్కుడు రసికుడు. మేటిగంభీరుడు బాపురే! రతిరహస్యవేత్త యయిన నాతనినే చెప్పవలయు పరేంగితజ్ఞుఁడతనికన్న బుడమిలోలేడు. నా ప్రౌఢిమి యంతయు నతనిచెంత గవ్వచేసినదికాదు. నాకెప్పటికిని దన మనస్సియ్యమి డెంద మాపజాలక యతండు మెడనుండితీసి శయ్యయందుంచిన మాలికలం గయికొని మరి యే అవకాశమును గానక ఆర్యా! వీని మీకంఠమున నుంచక తీయుచుందురేల? వీని దాల్చిన దర్శనీయముగా నుందురని మెడయందు వైచితిని. ఆతండెంత చతురుండో చూడుము ననినప్పుడే తనమెడనుండి తీసి బాలా! యివి మాకేల? యువతులు వీనిం దాల్చ నర్హులని పలుకుచు నవి నామెడ యందుంచెను. నేను వలదు వలదని పెనుగులాడు సమయములో నామేన నెందుముట్టెనో నాకు గళాభిదురమై మేను వివశత్వము