పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంగమణికథ

183

ఇంతలో సాయంకాలమగుటయు నామె గ్రామంబునంగల పేరంటాండ్రనెల్ల రప్పించి యాదంపతుల మనోహర సౌధాంతరములలోనున్న హంసతూలికతల్పంబుల యథాయోగ్యముగా గూర్చుండంబెట్టి గంధమాల్యానులేపన తాంబూలచర్వణాది వినోదవిధానంబులం దీర్చి పేరంటాండ్రకు తాంబూలము లిప్పించి మంగళహారతులు పాడించినది.

అట్లు పెద్దతడపు సుశీల పేరంటాండ్రతోగూడ వేడుకలు దీర వినోదములు నిర్వర్తించి యాదంపతులం గాంచుటచే దనకన్నులు సాద్గుణ్యము నొందినవని యానందించినది. రాజపత్ని ముత్తైదువలతో గూడ దలుపులు బిగియించి యరిగిన వెనుక రామలింగకవి యాకాంతను గన్ను లెత్తిచూచి మోహపరవశుడై యోహో జగన్మోహిని ఇంతకుమున్ను ముసుంగిడుకొని యుండుటచే లెస్సగాజూచి యుండలేదు మున్నువిన్నదానికన్న మిన్నగా నున్నయది శ్రీశుకుండైన నీ చిగురుబోడిని జూచెనేని మోహింపకుండునా? అయ్యారే! చతురాస్యుని సృష్టివై చిత్రమునకు మేరలేదుగదా! సాధుసాధు. ఇట్టి ముద్దుగుమ్మను నాయొద్ద గూర్చుండజేసిన విధి యుపకృతికి బ్రకృతి జేయలేను సార్వబౌముని కయిన నీయదృష్టము పట్టుట దుర్ఘటము. ఒక్కసారి యిక్కురంగాక్షిచే జూడబడిన జాలదే. త్రిభువనరాజ్యం బేమిటికని యనేకప్రకారంబుల దదంగసౌభాగ్యంబుల గొనియాడుచు బరవశమైన చిత్తమును స్వాయత్తము చేసికొని 'యక్కామినితో బెక్కులు నీతివాక్యములు సెప్పితి. నేను వేగిరించితినేని దేలికసేయకమానదు. ఈచిలుకలకొలికి చూపులఁ జాపల్యము పొడగట్టుచున్నది. ఇంచుక సైరించిన బంచశరుండు మంచి యుపకారం సేయకమానడని తలంచి, యమ్మానధనుండు దిగ్గున శయ్యడిగ్గనురికి తన మేన బూయబడిన గంధము దుడుచుకొని మాలికలదీసి ప్రాంతమందున్న పీఠంబున గూరుచుండెను.

మంగమణియు నతనితోడ పర్యంతము డిగ్గి యలంకారములేమియు దీయక యందొకచో నమర్చియున్న విపంచి పుచ్చుకొని శ్రుతి మేళగించి యపూర్వరాగోదయంబు దీపింప సంగీతము పాడినది. తదాగ్రశక్తి యెట్టిదో గాంధర్వాస్త్రంబువోలె నన్నాదం బాలించిన వారినెల్లం మోహవివశుల గావించినది.

అక్కాంత కొంతసేపు అట్లు వీణవాయించి ప్రొద్దుపోయిన వెనుక వీణం గట్టిపెట్టి యందున్న రత్నకంబళమున బరుండి చిత్తంబున బెక్కుతలంపు లుప్పతిల్ల జింతించుచు నిద్రబోయినది.

అంతలో దెల్లవారుటయు నత్తరుణీమణి యరుణోదయంబు కాకమున్న లేచి గదిలోనికి బోయి అంతకుమున్న వచ్చియున్న ప్రియంవదం జూచి నవ్వుచు నిట్లనియె. సఖీ! ప్రియంవదా! నీవు రాత్రి యెట్లుగడిపితివి. మనమేడ? ఈ బాడబులేడ? ఈ పత్నీభావమేడ? ఇట్టి దాంపత్య మేపురాణములోనయిన వర్ణింపబడి యున్నదా? మన మనంబులుమాత్రము పాషాణములా! ఉద్దీపనవిభావంబులబలంతియే!