పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

కాశీమజిలీకథలు - మూడవభాగము

వుటయేమి అబ్బురము (అని యెద్దియో సూత్రములు గణ గణ జదివెను) ఆసూత్రములే ముమ్మారు చదివించినది. మిక్కిలి బుద్ధిమంతుండగు నా శిష్యుండు ఆ కల్పన సూత్రములను మూడుసారులు యేకరీతిగానే చదివెను. ఆ పాఠము రామలింగకవి విద్యార్థులకు బోధించియున్నదే. తెరలోనుండి యా వాదము వినుచున్న మందారవల్లి యుల్లంబు దల్లడిల్లనవి యే శాస్త్రములోని సూత్రములో అని శాస్త్రనామముల జ్ఞాపకము చేసికొనుచుండెను. అప్పుడా శిష్యురాలు ఆ పుస్తకముల వ్రాతబట్టిచూడ మిక్కిలి ప్రాతదగుటచే నిజమేమో అను వెఱుపుతో ఆర్యా! లోకమంతయు వ్యాపించియున్న పాణినీయసూత్రములు ప్రత్యాఖ్యాతములై నవనియు క్రొత్తవాక్యరణముల ప్రమాణమేమియో చెప్పుడని అడిగినది అప్పుడు శిష్యుడు సకలసిద్ధాంతశాస్త్రసారంగతురాలగు లవిత్రయే దీనికి ప్రమాణమని చెప్పెను.

మీకు లవిత్ర ప్రమాణమైనచో మాకు మందారవల్లియే ప్రమాణము అని శిష్యురాలు చెప్పెను. అట్లయిన వారిరువురి వలననే యీ సిద్ధాంతము తేలవలసి యున్నది. కావున నీవు లోనికింబోయి ఈ విషయము లన్నియు నా వేశ్యాలలామమునకు బోధింపుము. పొమ్మని సావలేపముగా బలికి యీ శిష్యుడు తన పీఠముపై గూర్చుండెను భట్టుమూర్తిని మాటాడనీయక అక్షరమునకు నూఱు తప్పులంబట్టి సిగ్గుపఱచిన ఆగ్గరిత సిద్దాంతకౌముదియైనను తిన్నగా జదువని యొక విద్యార్థికి సమాధానము చెప్పలేక తొట్రుపడుచు లోనికిం బోయినది. తక్కిన శిష్యులను మందారవల్లి శిష్యురాండ్రకెల్లర నా రీతినే యతికి ప్రతి జెప్పుచు తమ ముందర నున్న గ్రంధముల జూపుచు నా లిపి వారికి దెలియమి సులభముగా పరాజితలం గావించిరి.

అట్లు మందారవల్లి శిష్యురాండ్రందరు రామలింగకవి శిష్యులచే నోడిపోయి వారు చెప్పిన ప్రమాణముల నొప్పుకొనక మందారవల్లినే మధ్యవర్తిగా గోరికొనిరి. వారితో రతిరహస్య విశేషములు తనకంటె విశేషముగా దెలిసిన వారెందును లేరని అభిమానముగల కలికికిని మఱియొక శిష్యునకు నీరీతి సంవాదము జరిగినది.

శిష్యు - యువతీ! నీవేశాస్త్రము చదివితివి. వాదశక్తి దేనియందు మిక్కుటమో వక్కాణింపుము ప్రసంగింతును

శిష్యురాలు -

శ్లో॥ భూయోభూయో మునివర గవీరర్థదుగ్థాని డుగ్ధ్వా
      నిర్మధ్యాతి ప్రణిహితధియా సోమయా దాయతః
      స్వాధుః వథ్యో లలిత యువతీ యౌవనాభోగభోగ్యో
      ముఖ్యోదేవైరపి బహుమత స్సేవ్యతాం ----తేంద్రాః

మిక్కుటమగు శ్రద్దచే బెక్కుసారులు వాత్స్యాయనాది మహామునులయొక్క వాక్యములనెడి పాలును తరచితరచి సారము దీవపట్టియు మందయగు యువతుల యౌవనముయొక్క అనుభవమే ప్రధానముగా గలిగినట్టియు దేవతా--------- భీష్ట