పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందారవల్లి కథ

159

మైనట్టియు, కొక్కొకమహామునియొక్క రచనయనెడు నవనీతమును పండితులు అనుభవింతురుగాక అను శ్లోకమునుజదివి నేనీశాస్త్రమును, సాంగముగా జదివితిని, ఎందేని బరీక్షింపుడు.

శిషు - ఆహా! ఉచితమేతత్ (ఇది నీకు దగినదే) కాని కామినీ! శాస్త్రానుభవమేనా, లోకానుభవ మేమైనంగలదా?

శిష్యురాలు - లోకానుభవములేనిశాస్త్రము. శాస్త్రానుభవము లేని లోకానుభవము శోభింపవుగదా?

శిష్యు - శోభింపవనుమాట యెఱుంగును నీకు రెండునుంగలిగియున్నవా లేవా? అవిషయమే చెప్పవలసినది.

శిష్యురాలు -- నాకు రెండునుం బూర్తిగా గలిగియున్నవి.

శిష్యు --- అట్లయిన బట్టణపుజంగశిఖామణులు ధన్యులేకదా?

శిష్యురాలు --- అప్రస్తుతముతో బనియేమి? ప్రస్తుతాంశముల సంభాషింపుడు.

శిష్యు -- కానిమ్ము! నీ రెంటిలో ముందు దేనిం బరీక్షింపను.

శిష్యురాలు — మీకేది యభీష్టమో దానినే.

శిష్యు — యుక్తతయుం (మంచిమాట బలికితివి) మన్మథశాస్త్ర ప్రయుక్తములైన గ్రంథము లేమేమి చదివితివో చెప్పుము.

శిష్యురాలు -- సకలగ్రంథసారంభూతంబైన రతిరహస్యంబు క్షుణ్ణముగా జదివితినని మొదటనే చెప్పితిని.

శిష్యు -- ఆలాగునా అట్లయిన మొదటి పరిచ్ఛేదమునందు నెనిమిదవశ్లోకం జదువుము.

శిష్యురాలు-

శ్లో॥ యద్వాత్స్యాయనసూత్ర సంగ్రహబహిర్భూతం కిమస్త్యాగమే
     దృష్టం వాచ్యమిదం మయా మునిగిరాంశ్రద్దాహి సాధారణా
     భావివ్యంజత మన్యభంగిరచితం తత్రైవచే దస్తియ
     న్మందానాముపయుజ్యతే తదితిహి స్పష్ణోభిధేయం కృతిః॥

వాత్స్యాయన మహర్షిసూత్రములుగా రచియించిన గ్రంథవిషయములనే నేను మందబుద్ధులగువారికి నుపయోగించు నిమిత్తము స్పష్టముగా వ్రాసితినిగాని యిందలి కల్పనలు నాయవికావు. మునివాక్యములయందుండిన నమ్మకము దీని యందును నుండదగినదని గ్రంథకర్త వ్రాసికొనినాడు ఇదియేనా.

శిష్యు -- అగునగు మందమతులకు సుపయోగము నిమిత్తము రచించిన గ్రంథము చదివి మన్మథకళారహస్యము లన్నియు నెఱుంగుదునని చెప్పుచుంటివా? మేలు మేలు!

శిష్యురాలు - ఓహో! ఇదియా మీకు దోచినశంక. మంచిదినుండు. చతు------- సృజించు సమయమున వేదప్రయుక్తముగా ద్రివర్గసాధనమను