పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

కాశీమజిలీకథలు - మూడవభాగము

శ్వరుం డెచ్చ టెచ్చటని పలుకుచు నాగదత్తుని మ్రోల మాటలాడుచున్న కందర్పుని పాదంబులబడి హా! జీవితేశ్వరా? రక్షింపుము. రక్షింపుమని వేడుకొనిరి.

అప్పుడు కందర్పుడు తెల్లబోయి ఆ! యిది యేమి చోద్యము ? ఈ జవ్వని యెవ్వతియ. నన్ను బ్రాణేశ్వరా అనుచున్నదేమి? సుభద్ర కాదుకదు? అమ్ముదిత యిచ్చట కేలవచ్చును? ఒకవేళ మనోరమ యగునా? నాకంత భాగ్యము కలుగునా? అయ్యో! నాపాదంబులంబడిన ఇప్పడతి మొగము శిరోజములచే నావృతమగుట గురుతుపట్టరాకున్నది. దీనికేమని నేను బ్రతివచన మియ్యను అని బహువిధంబుల దలపోయుచు ఆర్యా! ఈకాంత యెవ్వతెయో నాకు దెలియకున్నది. గుఱుతు లెఱుగజెప్పుము. ఈ మెకు నీ వేమికావలయునని నాగదత్తు నడిగెను.

అప్పుడతండు అయ్యో! తాతా యింకను నెఱుంగకుంటివా ? ఈమె నీవల్ల నాడీ వీటిప్రాంతమున విడువబడిన మనోరమయే. నేను భవదీయనందనుండ దైవకృపచే నాపత్తులన్నియుం గడిచితిమని పలుకుచు నమ్మజాలక యేమేమీ! యిది స్వప్నముకాదుకద. నిక్కువమే అగుంగాక ప్రేయసీ! వదనమెత్తి చూపుము కడ కటా! తెలిసికొనలేకపోయితినే అని అవ్వనితామణిం గ్రుచ్చియెత్తి కౌగిటంజేర్చుచు బోఁటీ యీతడు నాపట్టి అగుటయెట్లు? అగునగు జ్ఞాపకమున్నది వత్సా! యిటురమ్ము. నేడెంతసుదినము. ఔరా గాలమహిమ! అయ్యారే! విధి నియంత్రమని పెక్కు తెరంగుల నాశ్చర్యమందుచు సంతోషముతో బుత్రుగౌగిలించుకొని శిరముమార్కొని డగ్గుత్తికతో పట్టీ! నీకీరాజ్య మెట్టువచ్చినది. ప్రేయసీ! నీవు నారాక తెలియక ఏమి చేసితివి? నన్ను గృతఘ్నునిగా దలంచితివి కాబోలు? దైవయోగమున నా కప్పుడట్టి బుద్ధిపుట్టినది. లేకున్న ప్రాణములకన్న ప్రియమగు నీమాట మరచిపోవుదునా? నీవు తరువాత నేమిచేసితివో చెప్పుము. వినుటకు నాకు మిక్కిలి యాతురముగా నున్నదని పలికిన నక్కలికియు గన్నీరు దుడుచికొనుచు నిట్లనియె.

నాగదత్తుని కథ

ప్రాణేశ్వరా! వినుండు మీరు ఫలములకై అరిగి యెంతసేపటికి రాకుండిన నేనా చెట్టుక్రింద గూర్చుండి పెక్కుతెరంగుల నంతరంగమునం దలపోయుచు నెవ్వరేని నింతవారలు వచ్చినప్పుడు చెట్లమాటునకు బోవుచు సాయంకాలమువరకు మీరాక బరీక్షించి అప్పటికి నిరాశచేసికొని యుల్లంబు ఝల్లుమన మనంబున నిట్లు తలంచితిని. అయ్యో! దైవమా నన్నీ కందర్పకైతవంబున నాపత్సముద్రంబున