పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యావతి కథ

127

ధనమంతయు బ్రాహ్మణాధీనము గావించెనేని దొరకునని చెప్పినమాటనిజమే! పురాణములలో అట్లున్నది కావున జెప్పితిని. ఇంతమాత్రముననే నాది తప్పైనచో బెక్కురీతుల నాశీర్వచనములు జేయు బ్రాహ్మణుల నందరిది తప్పేయగు ఆశీర్వచనప్రకార మెవ్వరికి లభించును. నే నొక్కకాసైన స్వీకరించితినేమో అడుగుడు ఇంత మాత్రమువ నన్ను దప్పుజేసినవానిగా నెంచి కారు లఱచుచు నాతోలుజింకను జించి పారవేసినది ఇది మిక్కిలి విలువగలది. దీని నేను దేశాటనము చేయు తాత్పర్యముతో నెరపుతీసికొని వచ్చితిని. దీని జించినందులకీ పురోహితుడే సాక్షి దేవర కెట్లు న్యాయమని తోచిన అట్లు చేయుడని చెప్పి అతం డూరకుండెను.

అతని మాటలువిని యానాగదత్తుడు మనంబున నెద్దియో ధ్యానించుచు గన్నుల నుండి వెల్వడు నానందబాష్పముల దుడిచికొనుచు గన్నులు మూసికొని యొక్కింతసే పాపీఠస్తంభంబున నోరగా జేరబడి కూర్చుండి అంతలో లేచి యోహో! దీని పర్యవసానము రేపుజెప్పెదను. అందరును బోయి రేపు రండని యానతిచ్చి అప్పుడు పీఠమునుండి లేచుటయు సభ్యులందరు లేచి క్రమంబున అయ్యొడయని అనుజ్ఞ గైకొని తమతమ నివాసములకు బోయిరి.

అప్పుడా నాగదత్తుడు గందర్పుని మాత్రము వెళ్ళనీయక హస్తము గైకొని తన యంతఃపురములకు దీసికొనిపోయెను.

కందర్పుడు వానితో నడుచునప్పుడు మనంబున నాహా! ఈ రాజకుమారు డెవ్వడో నన్నింత గౌరవముగా దీసికొనిపోవుచున్నాడేమి? నాకులశీలనామంబులు గ్రహించెనా లేక రత్నావతినట్లు భంగపరచినందులకు సంతసించెనా? వీని ముఖమందు మనోరమ ముఖచిహ్నములు గనంబడుచున్న వేమి? అయ్యో? నే కాంతను వెదుకక ఈ గొడవలో బడిపోయితినేమి యని పెక్కుతెరంగుల దలపోయుచు నాయనవెంట అంతిపురి కరిగెను. నాగదత్తుడు కందర్పుని శుద్దాంతమున గాంచనాసనాసీనుం జేసి యొరులెవ్వరు లేకుండ నాతనితో మెల్లన నిట్లనియె.

అయ్యా! తమదేశ మేమి, నామధేయ మేమి? యారత్నావతి అట్లు వంచించుటకు గారణమెద్ది? మీకు సంతానముకలదా? యథార్థము జెప్పుడు. నిజము గ్రహించితిని. నిక దాచనక్కరలేదు. నన్ను మీపుత్రునిగా నెంచుకొనుడు. మనోరమను దలంచుకొని చింతించుట ఆకాంత యెవ్వతియె? తదీయస్మరణమాత్రంబున బరితపించిరనుటకు గారణమేమి? మీవృత్తాంతమంతయు వినవేడుక అగుచున్నది. వక్కాణించెదరే? అనిఅడిగిన గందర్పుండు తదీయమృదుమధురగంభీరసంభాషణములకు డెందం బానందమంది యింతయేని గొరంతబుచ్చక తనకథ అంతయు అతని కెఱింగించెను.

అప్పుడు నాగదత్తుడు ఒకయుత్తరమును వ్రాసి పరిచారిక చేతి కిచ్చి లోపలకు అంపెను. అంతలో లోపలనుండి యొక మత్తకాశిని తత్తరంబున జనుదెంచి ప్రాణే