పుట:Karunakamu Story by Veturi Prabhakara Sastry.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గినవారు సంగీతస్వారస్యము బాగా తెలిసినవారు పలువురు ఉండేవారు. ఆయనకు కలిగిన ఆపదనుగూర్చి చింతిస్తూ తగినతోడ్పాటు జరుపుటకు యత్నిస్తూ ఉండేవారు. ఇట్లా ఉండగా ఆ కాలమునబందరులో ఒక గొప్పషాహుకారింట్లో వివాహమువచ్చినది. జమీందారీయెత్తున ఆవివాహపుయేర్పాట్లుజరిగినవి. ప్రాజ్ఞులందరు ఆలోచించి ఆపెండ్లికి హరిరామయ్యగారి పాటకచ్చేరీ నిర్ణయించినారు. అప్పులవాళ్ల తళ్లుచేత రామయ్యగారందుకు ఒప్పుకొన్నారు. మూడునూటపదహార్లు ఇచ్చేటట్లు ఏర్పాటు జరిగినది. అప్పటికింకా గ్యాసులైట్లు ఆప్రాంతముల వ్యాపించలేదు. మదరాసునుండి అప్పుడే ఆపెండ్లికే తొలిసారి వాటిని తెప్పించినారు. పెండ్లినాటి సాయంకాలము హరిరామయ్యగారిపాటకచ్చేరికి అనేకులు వచ్చిరి. గ్యాసులైట్లను వెలిగించి రామయ్యగారు వీణశ్రుతి దిద్ది వాయింపనారంభించినారో లేదో వెలిగించడములో ఏదో అసందర్భము జరిగి అంతలో గ్యాసులైటు ఒకటి పగిలినది. పందిలికి మంటలు అంటుకొన్నవి. పెండ్లికుమార్తెకు మరికొందరికి ఒళ్లుకాలి అమంగళము జరిగినది. దానితో రామయ్యగారిపాట అమంగళపుపాట అని దుష్ప్రతీతి పుట్టినది. రామయ్యగారిప్రఖ్యాతిముందర పేరెత్తజాలని వారెవరో సంగీతవిద్వాంసులు ఈదుష్ప్రతీతిని చాటించారని కొందరంటారు ఎవరు చాటించినా అప్రతీతి మాత్రము ఆవైపుల బాగా అల్లుకొన్నది. నాటినుండి సంగీతకచ్చేరీలకు ఆయనమాట తలపెట్టేవారు తక్కువయినారు. ఈదుష్ప్రతీతిచేతనే కాక కాలపుమారుపాటుచేత కూడా ఆయనకు సమ్మానము సన్నగిల్లినది. ఇప్పుడు నేనుచెప్పేది పదిహేనేండ్ల క్రిందటి మాట. పారసీఖత్తుపాటలుగల నాటకరంగాలు, జావళీలు, టప్పాలు మొదలయిన క్రొత్తరకపు సంగీతము,ఫిడేలు,హార్మోనియము మొదలయిన క్రొత్తరకపు జంత్రములు వెలసినవి.వాటిమీద మోజు యెక్కువయి ప్రాచీనపు జంత్రముల మీద ప్రాచీనగానఫణుతులమీద ఆదరము బీదపడినది. 'క్రొత్తవింత పాతరోత' అన్నమాట ఉన్నదిగదా! రామయ్యగారు అది, పిదపకాలపు సంగీతమని చాటుచేయక చాటిచెప్పుతూ ఉండేవారు. సంగీతస్వారస్వ మెరిగినవారు ఆయనమిత్రులు ప్రాచీనులు పలువురు అంతరించిరి. క్రొత్తకారు కుఱ్ఱరకమునకు ఈయనమాటలు హేయములుగా తోచుచుండెను. అందుచేతకూడా ఆయన గౌరవముకొంత అంతరించినదని చెప్పవచ్చు. ఏదియెట్లున్నా ఆయన తనపాండిత్యవిశ్వాసము కోల్పోలేదు. వయసుమీరినవాడయినా తాను ప్రతిదినము సాయంప్రాత స్సమయములందు సంగీతసాధన మానేవాడు కాడు. ఊరిబయటికి పోయి వృక్షాలకు పక్షులకు, పుట్టలకు గట్టులకు, శిశువులకు పశువులకు, దినదినము తనపాటవినిపిస్తూఉండేవాడు. అప్పటికి యాభై, యాభై యయిదేండ్లవాడయినా ఆయనకు పలువరుస వేరు వాయక గొగ్గి లేక తీరుగాఉండేది.

దైవముప్రతికూలముగ ఉంటే బంగారముకూడా పదడవుతుం దంటారు. ఒకనాటి తెల్లవారుజామున వీణసాధనకు గౌసెన ఊడ