Jump to content

పుట:Karunakamu Story by Veturi Prabhakara Sastry.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆయననుగూర్చి అద్భుతముగా చెప్పుకుంటారిప్పటికీ కొందరు బందరులో ఒకసారి ఆయన గానసభ జరుగుతూ ఉండగా ఒకడిప్టీకలెక్టరు మీసములు మెలుపుతూ నడుమ అందుకొని "అయ్యా! ఫలానిరాగము వాయించండి" అని అడిగినాడట! అమృతవర్ష మన్నట్టు నేనీరాగము హాయిగా వాయిస్తూ ఉంటే అనుభవించి ఆనందించలేక ఇంకేదో రాగము వాయించుమంటాడేమి అజ్ఞుడు అని కోపించుకొని వీణశ్రుతి తప్పించి క్రిందపెట్టి "ఈసాంబడిపాట ఆసాంబడు వినవలెగాని నీవు వినేదేమిటి, పో, పొ"మ్మన్నాడట ఆసాంబన్నగారు అటువంటిసాంబన్నగారు మనహరిరామయ్యగారి వీణాగానము విని ఆనందపరవశుడై కౌగిలించుకొని "అసాధారణమైనది నాయనా నీపాండిత్యము"అని అభినుతించినాడట!ఆసాంబన్నగారప్పుడు రామయ్యగారిని మైసూరికి పిలుచుకొనిపోయి మహారాజాగారి దర్బారులో పాటకచ్చేరీపెట్టించి గొప్పసత్కారము జరిపించినాడట! మహారాజాగా రప్పుడు మహానందము చెంది రామయ్యగారికి రెండునూటపదహార్లు, రెండుచేతులకు రత్నాంకితములైన కడియములు, దుశ్శాలువులు, జిలుగుబంగారుసరిగెపనిగల తలగుడ్డ, అంగీ, వగైరాలు ఇచ్చి సమ్మానించినారట! ఇది మనపుట్టుకకు పూర్వపు ముచ్చట.

ఇటీవల దారిద్ర్యముచేత మురుగులజత కరిగించుకొన్నారట కాని పెట్టె చీకుళ్లయి చిమటపోట్లతూట్లతో ఉన్న శాలువులను, అంగీతలగుడ్డలను, అప్పుడప్పుడు రామయ్యగారు ఎండలో ఆరబెట్టుతూ చక్కపరుస్తూ ఉండడము అనేకు లెరుగుదురు. ఇంత ప్రఖ్యాత విద్వాంసుడయిన రామయ్యగారికథ యిర్వైయైదేండ్లనుండి తార్మూరు కాజొచ్చినది.

ఆయన కొక్కర్తే కుమార్తె. మంచి గారాబముతో కూతుర్ని పెంచినాడు. తన పాండిత్యగౌరవమునకు తగినట్టు ఉండవలెనని తాహతుమించి మంచికట్నమిచ్చి గొప్పసంబంధము కుదిర్చినాడు. పెద్ద వైభవముతో పెండ్లిచేసినాడు. ఆపెండ్లికి చెన్నపట్ణమునుంచి గొప్ప సన్నాయిపాటగాళ్లు వచ్చినారు. ఇంకా సంగీతవిద్వాంసు లనేకులు వచ్చినారు. వారివారికి ఆయన గొప్పసమ్మానములు జరిపినాడు. ఇంతయెత్తుతో వివాహము జరుపడముకు తగినంత ద్రవ్యము ఆయనచేతిలో లేదు. మూడెకరాలమాగాణే ఆయనకున్న భూవసతి. తన పాండిత్యపాభవము విశ్వసించి, అప్పుచేసి ఆయన అంత గొప్పగా పెండ్లిచేసెను. పెద్ద పెద్దచోట్ల నాల్గు కచేరీలు జరిపి అవలీలగా అప్పుతీర్చగల్గుతానని అనుకొన్నాడు. ఆయన తలపు అట్లాఉంటే దైవము తలపు అన్యధాగా ఉండెను. పెళ్లి అయి నెలతిరగకముందే ఆ అల్లుడు అంతరించినాడు. అయ్యో! ఆయనకథ అడ్డముతిరగడాని కిదే ఆరంభము! కూతరి దు:ఖము పెద్దకడుపుకోతగా ఆయన కేర్పడ్డది. ఆకష్టముతో మనస్సు చీకాకై చెడగా ఆయన రెండుమూడేళ్లు ఇల్లు విడిచి పదచలనముచేయలేదు. చింతతో చివికిపోయినాడు. అప్పు పెరిగినది. పొలముమీది రాబడి బువ్వకు ఆటీఆటకుండా ఉన్నది. చిక్కులలో చిక్కుకొన్నాడు. ఆకాలమున ఆయనఘనత ఎరి