మొదటికూర్పు పీఠిక.
ఆర్యులారా!
మహాత్ముల చరిత్రము లైహికాముష్మికఫలసాధనములై యొప్పుచుండును. ఇందుఁ బరమభాగవత శిఖామణియగు నారదమహర్షి చరితము తెలువు కథలు వ్రాయబడినవి. చిరకాలమునుండి నాకీ మహాత్ముని చరిత్రము వ్రాయవలయునని యభిప్రాయము గలిగి యున్నది. ఋషులచరిత్రములు వేదాంత కథాప్రసక్తములగుటఁ బండిత పామరహృద్యములుగా నుండవని యుపేక్షజేసితిని.
మఱియుఁ దచ్చరిత్రాంశములు విమర్శింపుచుఁ బురాణములు పరికింప నెందుఁజూచినను నమ్మునిచంద్రు ని కీతిన్ చంద్రికలే హృదయాహ్లాదము గలుగఁ జేయుచుండునవి. మహాభారతము, బ్రహ్మవైవర్తము, దేవీభాగవతము, భాగవతము, లోనగు ఫురాణములన్నియు నమ్మహాభాగుని ప్రభావము వేనోళ్ళఁ బొగడుచున్నవి.
వానీలో ముఖ్యములు పండితపామరజన మనోహరములు చరిత్రాత్మకములగు కథల నేరి యిందువ్రాసితిని. ఇంకను వ్రాయవలసిన విషయములు చాలగలవు. వానినెల్ల మఱియొకప్పు డీకాశీమజలీ కథలయందుఁగాక వేరొక భాగముగా వ్రాయఁదలంచికొంటి. అది కేవలము వేదాంత ప్రబోధకముగా నుండును.
నారదమహర్షి హరిమాయా మోహిుతుం డగుచు నాఁడుదియై తాళధ్వజుం డను నృపాలుం బెండ్లయాడి యిరువండ్రఁ గుమారులం గనుటయు లోకైక వీరులగు నారాజకుమారులు దేశసంచారముజేసి నాలుగుదిక్కులు జయించి త్రిలోకాభిరామలగు రామలం బెండ్లియాడి యనేకవిచిత్రకార్యములు గావించిన విషయములు ఇదివఱ కిందుఁ వ్రాయఁబడిన వరప్రసాదులు, విజయభాను రామచంద్రులు, అదృష్ట దీవుఁడు లోనగువారి కథలకన్నఁగడు చమత్కృతిగా నున్న వని పండితు లభిప్రాయ మిచ్చియున్నారు.