పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బహుశ: వారు దీనిని ఒక రాష్ట్రముగాగాని, రాష్ట్ర ముఖ్యపట్టణముగాగాని యుంచియుండలేదు. కాని అప్పటికిని దీనిని అనేక ముఖ్యపట్టణములలో ఒకటిగా గుర్తించియుండిరి. కాకతీయ ప్రతాపరుద్రుని కాలమునాటి శాసనము ఒకటి ఇచ్చట దొరకినది. ఇందులో కాకతీయ ప్రతాపరుద్రుని క్రింది ఉద్యోగి రాష్ట్రకూట వంశజుడు, ఇచ్చట స్వయంభు మాణిక్య తీర్థేశ్వరస్వామి వారి త్రికాల ధూపదీప నైవేద్యములకై కొంతభూమిని దానము చేసినటుల తెలియుచున్నది.[1] కొలనుపాక ప్రభుత్వ పరంగా తనయాధిక్యతను కోల్పోయిననూ, ఇది ఒక ప్రధానపట్టణము గాను, మతపరముగాను పెద్ద పుణ్యతీర్థంగానూ ఉండినది. అందుకు నిదర్శనంగా, సోమేశ్వరస్వామివారి దేవళ గడపల మీదకల తతువాతి కాలంనాటి చిత్రములవల్ల తెలియుచున్నది.[2] అదేగాక ఇప్పటికిని ఈ గ్రామము సిరిసంపదలతో తులతూగుచుండుట మరొక ముఖ్య నిదర్శనము.


-<•>-

  1. ప్రతాపరుద్రుని శాసనము: సంస్కృతము: రిపోర్ట్ ఆన్ ఎపిగ్రఫీ (ఆంధ్ర ప్రదేశ్) 1965: పేజి. 62: శాసనము: 266.
  2. విజయనగరము, తరువాతి కాలపునాటి చిత్రములు కొన్ని ఇప్పటికిని మనకు కనిపించుచున్నవి.