పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొలనుపాక - శిల్పములు

1. ద్వారబంధము :- ద్వారబంధమున కిరువైపుల చెక్కడపు పనికలదు.

(ఎ) గజలక్ష్మి :- ద్వారబంధమున కొక వైపున గజలక్ష్మి చెక్కబడియున్నది లక్ష్మీదేవి పద్మా సనాసీన అయి రెండు చేతులందు పద్మములను ధరించి యున్నది. అవి ఆమె భుజములవరకూ వచ్చియున్నవి. వజ్ర, వైడూర్యములు చెక్కిన బంగారు ఆభరణములను ధరించియున్నది. చెవులకు మకరకుండలములు కలవు. దేవి కిరీట మకుటధారిణి. రెండు ఏనుగులు ఇరువైపులనుంచి పుణ్యజలమును లక్ష్మీదేవి శిరస్సున అభిషేకించుచున్నవి. శిల్పశైలి దృష్ట్యా యిది. క్రీ. శ. 11 శతాబ్దమునకు చెందియుండవచ్చును.
(బి) దక్షిణామూర్తి :- ద్వారబంధము రెండవవైపున దక్షిణామూర్తి రూపము చెక్కబడియున్నది. దక్షిణామూర్తి పద్మాసనముమీద వీరాసనములో కూర్చొని, ఒక కాలు అపస్మార పురుషుని వీపుమీద వేసియున్నాడు. ఇతను త్రినేత్రుడు, చతుర్‌భుజుడు. చేతులలో జ్ఞానముద్ర - వరదముద్ర - దండము - అక్షమాల కలిగియున్నాడు. జటామకుటధారి. యజ్ఞోపవీతము, చెవులకు శంఖపత్రమును ధరించెను. మెడయందు రుద్రాక్షమాల కలదు. సప్తఋషులు ఇతనిని పూజించుచున్నారు. దక్షిణామూర్తి ఆత్మయోగమును గూర్చి, సంసార బంధములనుంచి విముక్తి గురించి ఋషులకు బోధచేయునట. అతను ఆసీనుడైయున్న పద్మాసనము, అతిపవిత్రమైన "ఓం" కారమునకు నిదర్శనమట. శిల్ప శైలి దృష్ట్యా ఇది క్రీ. శ. 11 శతాబ్దమునకు చెందినది.

2. కోష్ఠపంజరము :- ఈ శిల్పము ఉబ్బెత్తు ప్రతిమ (Relief figure). ఇది దేవాలయ శిఖరమువలె మూడూంతస్తులతో చెక్కబడియున్నది. మొదటి అంతస్తునందు మామూలుగా కనిపించవలసిన దేవతా ప్రతిమలు (మూర్తులు) కనిపించుట లేదు. స్థల నిర్దేశము మాత్రము కలదు. శైలిదృష్ట్యా క్రీ. శ. 10 లేక 11 శతాబ్దమునకు చెందినది.

3. పార్శ్వనాథుడు :- ఇతను ఇరువది మూడవ జైన తీర్థంకరుడు. కాయోత్సర్గస్థితియందున్నాడు (ఎలాటివంపులు లేక నిటారుగా నిలుచొని యుండు