పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలన మధ్య యుగమునకు పూర్వమే కొలనుపాక ఒక మహాశైవ పుణ్య క్షేత్రముగా భాసిల్లినదని తెలియ వచ్చు చున్నది.

మధ్యయుగమున కొలనుపాక దుర్భేద్యమైన కోటగా భాసిల్లినది. అయిదవ విక్రమాదిత్యుని కాలమునాటికి (క్రీ.శ. 1008 - 1015) యిది ఒక పెద్ద కోట. రాజేంద్ర చోళుని మూడవ రాజ్య పాలనా సంవత్సరమునకు చెందిన ఒక దాన శాసనములో అతను కొలకు పాట పట్టణమును పట్టుకొని నటుల తెలియు చున్నది. అంతకు పూర్వపు శాసనములు ఈ విషయమై ప్రస్తావన చేయనందున రాజేంద్ర చోళుడీ పట్టణమును క్రీ.శ 1013 -1014 లో పట్టుకొని యుండ వచ్చును. ఇతను అయిదవ విక్రమాదిత్యుని జయించి ఈ కోట స్వాధీనపరచుకొని యుండవచ్చును. ఆ కారణము వల్ల రెండవ జయసింహుడు (పశ్చిమ చాళుక్య ప్రభువు) క్రీ.శ. 1015 న రాజ్యమునకు వచ్చి, రాజేంద్ర చోళునితో అనేక మారులు యుద్ద మొనరించిననూ, కొలను పాక యొక్క ప్రతిపత్తి ఏమాత్రము మారినటుల లేదు. మొదటి జగదేక మల్లుని కాలమునకు (క్రీ.శ. 1033) చెందిన ఒక శాసములో కొల్లి పాకను మన్నే కలిమయ్య అను దేవున కంకిత మొనరించి నటుల తెలియున్నది గాన చోళ రాజు ఈ నగరమును తాత్కాలికముగ జయించినను ఇది చాళుక్య రాజుల క్రిందనే యుండెను.

మొదటి జగదేకమల్లుని తరువాత మొదటి సోమేశ్వరుడు రాజ్యమునకు వచ్చెను. ఇతనికి అహవమల్లుడను బిరుదు కూడ కలదు. ఇతని కాలములో అనగా క్రీ.శ. 1042 లో కుమార విక్రమాదిత్యుడు (తరువాతి ఆరవ విక్రమాదిత్య మహా రాజు) మొదటి రాజాధిరాజు (చోళ ప్రభువు) వీరికి యుద్దమునకు వెళ్ళి దన్నడయను చోట ఓడిపోగా, రాజాధిరాజు చాళుక్య రాజ్యములో ప్రవేశించి కొలను పాక వరకూ వచ్చి, దానిని దగ్ధము చేసినటుల శాసనములు తెలుపు చున్నవి. రెండవ సోమేశ్వరుడు క్రీ.శ. 1068 లో రాజ్యమునకు వచ్చి క్రీ.శ. 1078 వరకు రాజ్య పాలన సాగించెను. ఈ పది సంవత్సరములలోనూ, కొలను పాకకు సంబంధించినంత వరకూ ఎలాటి ముఖ్య సంఘటనలూ జరుగలేదు. ఆ తరువాత క్రీ.శ. 1076 లో ఆరవ విక్రమాదిత్యుడు రాజ్యమునకు వచ్చి సుమారు అర్థ శతాబ్ధము రాజ్యము చేసెను. ఈ సమయములో కొలనుపాక సుఖ శాంతులలో తులతూగినది.

ఆరవ విక్రమాదిత్యుని కాలమునకు చెందిన ఆరు శాసనము కొలను పాక యందు కలవు. అన్నింటికన్నా పురాతన మైనది క్రీ.శ. 1088 నాటిది. ఇందులో తొండరస చోళ మహారాజు కొలను పాక రాజ్యమునకు మహామండలేశ్వరుడుగా యుండినటుల తెలియు చున్నది. అతను ఇచ్చట పరివేష్టించి యున్న ఉత్త రేశ్వరునకు కొంత భూమిని దానముగా నిచ్చినటుల తెలుపు చున్నది. రామేశ్వర పండితుడను వాడు కొలను పాక వాస్తవ్యుడు. ఉత్తరేశ్వరుని గుడి యజమానిగా ఆ దానమును