పుట:Jyothishya shastramu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోని కర్మ మాత్రము మనిషి మనిషికీ తేడా కల్గియున్నది. ప్రతి మనిషిలోని కర్మభేదము వాని అనుభవములో కనిపించుచున్నది. దేవునికి సంబంధించిన బ్రహ్మచక్రమును ప్రక్కనయుంచి మనిషికి సంబంధించిన గుణ,కర్మ,కాల చక్రములను చూచితే మూడు చక్రములలో మధ్యన ఉండునది కర్మచక్రము. మధ్యనగల కర్మచక్రమే మూడు చక్రములలో ముఖ్యమైనదని చెప్పుకొన్నాము. కాలము గుణము అందరికీ సమానమే అయినా, కర్మ మాత్రము ఏ ఒక్కరిలో సమానముగా లేదు. ప్రతి మనిషిలోను వేరు వేరుగాయున్న కర్మ మనిషి యొక్క గుణములను ప్రేరేపించుచున్నది.


34వ పటము. కర్మపత్రము