పుట:Jyothishya shastramu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పైన కాలచక్రములోగల గ్రహముల కిరణములు కర్మచక్రములోని కర్మమీద పడగా, కర్మయొక్క నీడ క్రింద గుణముల మీదపడుచున్నది. పడిన కర్మనీడనుబట్టి అప్పటికి ఏ గుణము అవసరమో ఆ గుణము ప్రేరేపింపబడుచున్నది. ఆ సమయమునకు ప్రేరేపింపబడిన గుణము చేత కార్యము చేయబడును. కర్మ కారణముచేత గుణమువలన జరుగు పని కొంత కాలము జరుగుచున్నది. ఎంత కాలము జరిగినదనుటకు కర్మను బట్టి కాలముండును. కర్మ కొద్దిగాయుంటే తక్కువ కాలములో అనుభవ ముండును. కర్మ చాలాయుంటే ఎక్కువకాలము అనుభవముండును. ఈ విధముగా కర్మనుబట్టి ఇటు గుణములూ, అటు కాలముండును. కావున కర్మనుబట్టి కాలమూ, కర్మనుబట్టి గుణములుండునని చెప్పవచ్చును.

23. గుణచక్రములోని భాగములలో ఏది మంచిది?

గుణచక్రములో మూడు గుణములుగల భాగములు, ఒకటి గుణము లేని భాగము మొత్తము నాలుగు భాగములుండును. గుణములు ఏ భాగములోయున్నా వాటిని ‘‘మాయ’’ అనవచ్చును. మూడు గుణ భాగము లకు మధ్యలోనున్న గుణములేని భాగమును ఆత్మ భాగమనియూ, మాయా తీత భాగమనియూ, గుణరహిత భాగమనియూ, యోగ స్థానమనియూ అనవచ్చును. గుణచక్రము బయటి వరుసలో మొదటి భాగము తామస గుణభాగము, రెండవది రాజస గుణ భాగము, మూడవది సాత్త్విక గుణ భాగము అను పేర్లతో చెప్పుచున్నాము. మూడు భాగములలోని గుణములు వేరువేరు ఆలోచనలను రేకెత్తించి, ఆలోచనకు తగినట్లు ప్రవర్తింప జేయును. గుణ ఆచరణలో పాపపుణ్య కర్మలు తయారగుచున్నవి. జ్ఞాని అయినవాడు గుణాచరణ వలన వచ్చిన కర్మనుండి తప్పించుకోగలడు. జ్ఞానము లేనివాడు