పుట:Jyothishya shastramu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్మ ఫలకము అనియూ చెప్పుచుందురు. మనిషికి (జీవునికి) అనుభవము నకు వచ్చేది కర్మయే. జీవుడు గుణముల మధ్యలోయున్నా, గుణములను ఉపయోగించుకొని కర్మను అనుభవించుచున్నాడు. పైన కాలచక్రములో ద్వాదశగ్రహములున్నా జీవునికి కర్మను అనుభవింపజేయుటకేయున్నవి. అందువలన ప్రతి మనిషికీ, ప్రతి జీవరాశికీ కర్మచక్రమే ముఖ్యమని తెలియు చున్నది. కాల, కర్మ, గుణచక్రములలో కర్మచక్రమునకు ప్రాధాన్యత ఇస్తూ కర్మపత్రమనీ, కర్మలిఖితమనీ, కర్మఫలకమనీ చెప్పడము జరిగినది.

కాల, కర్మ, గుణచక్రముల నిర్మాణము మనిషి తలలోయున్నా దాని నాడి వీపులో క్రిందివరకు వ్యాపించియున్నది. అందువలన మూల గ్రంథములలో దేవుడు కర్మను వీపున వ్రేలాడదీసి పంపాడనీ, మెడలో కట్టి పంపాడనీ ముఖాన వ్రాసిపంపాడని చెప్పడము జరిగినది. అందువలన బ్రహ్మ, కాల, కర్మ, గుణ అనబడు నాల్గుచక్రములను కలిపి కర్మ విధానమని, కర్మపత్రమని చెప్పడమైనది. ప్రతి మనిషియొక్క కర్మలిఖితములో (కర్మవ్రాతలో) తేడాలున్నాయి. ఏ విధముగా మనిషి యొక్క హస్తములోని వేలిగుర్తులు ప్రతి ఒక్కరికీ వేరువేరుగా ఉండునో, అలాగే ప్రతి మనిషియొక్క కర్మ లిఖితము వేరువేరుగా కొంతయినా తేడా కల్గియుండును. ప్రతి మనిషిలోనూ గుణ చక్రములోని గుణములుగానీ, కాలచక్రములోని గ్రహములుగానీ ఏమీ తేడా లేకుండాయున్నవి. గుణచక్రములోని మూడు భాగములలోగానీ, పన్నెండు గుణముల చీలికలైన 108 గుణముల భాగములలో గానీ తేడా లేకుండా అందరిలో సమానముగా ఉన్నవి. అలాగే కాలచక్రము లోని పన్నెండు గ్రహములలోగానీ ఏమాత్రము తేడా లేకుండా అందరిలో ఒకే విధముగా ఉన్నవి. నాల్గుచక్రముల సముదాయములో ఒక్క కర్మచక్రము తప్ప అన్నీ ఒకే విధముగా అందరిలో ఉండగా, కర్మచక్రము