పుట:Jyothishya shastramu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాగములలో గలవు. ఇక్కడ విచిత్రమేమంటే! ఇంతవరకు ఎవరికీ తెలియని గ్రహముల సంఖ్య మనకు తెలిసినది. కాలచక్రములోని 12 గ్రహములు అదే చక్రములోని 12 భాగములను తమ స్వంతస్థానములుగా ఏర్పరచుకొన్నవి.

గుణచక్రములోని రెండు వర్గముల గుణములనుబట్టి, పాపపుణ్య అను రెండు వర్గముల కర్మ తయారగుచున్నది. ఆ కర్మను కర్మచక్రములో రెండు వర్గములుగానే స్థాపించుటకు గ్రహములు కూడా రెండు వర్గములైనాయి. అలా ఏర్పడిన ఒక్కొక్క వర్గములో ఆరు గ్రహములుండగ, రెండు వర్గములలో 12 గ్రహములు గలవు. కష్టానికి వ్యతిరేఖమైనది సుఖము. అలాగే పాపమునకు వ్యతిరేఖమైనది పుణ్యము. వీటిని గ్రహించు గ్రహములు కూడ రెండువర్గములై, ఒకదానికి ఒకటి వ్యతిరేఖముగా ఉన్నవి. కర్మనుబట్టి రెండు వర్గములైన గ్రహములలో, ఒక్కొక్క వర్గమునకు ఒక్కొక్క గ్రహము ఆధిపత్యము (నాయకత్వము) వహించుచున్నవి. అలా ఏర్పడిన రెండు వర్గముల యొక్క అధిపతులు ఒకరు గురువు, మరొకరు శని. వీరిని బట్టి మిగత గ్రహములను గురువర్గము (గురుపార్టీ) గ్రహములనీ, శనివర్గము (శని పార్టీ) గ్రహములనీ అనుచున్నాము. ఒక వర్గమునకు శని నాయకుడు కాగ, అతని ఆధీనములో మిగత ఐదు గ్రహములుండును. అలాగే మరొక వర్గమునకు గురువు నాయకుడు కాగా, అతని ఆధీనములో మిగత ఐదు గ్రహములుండును.