పుట:Jyothishya shastramu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుణములనీ, రెండవ గుంపులోని గుణములు మంచి గుణములనీ పేరుగాంచి ఉన్నవి. చెడు గుణములు మొత్తము ఆరు గలవు. అట్లే మంచిగుణములు మొత్తము ఆరు గలవు. చెడు గుణముల పేర్లు వరుసగా 1) కామము 2) క్రోధము 3) లోభము 4) మోహము 5) మదము 6) మత్సరము అని గలవు. వీటినే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు అంటాము. మంచి గుణముల పేర్లు వరుసగా 1) దానము 2) దయ 3) ఔదార్యము 4) వైరాగ్యము 5) వినయము 6) ప్రేమ అని గలవు. వీటినే దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమలు అంటాము. మొదటి ఆరు చెడు గుణములు ఒక గుంపుగా, రెండవ ఆరు మంచి గుణములు మరియొక గుంపుగా గలవు. అంతేకాక మొదటి గుంపులోని ఆరు చెడు గుణములకు వ్యతిరేఖగుణములుగా, రెండవ గుంపులోని ఆరు మంచి గుణములు గలవు. శరీరములోని జీవునికి ఆరు చెడు గుణములు శత్రువులనీ, ఆరు మంచి గుణములు మిత్రులని పేరుగాంచి ఉన్నవి.

జీవునికి చెడు ఆరు గుణములు శత్రువులుగా ఉండి, ఆ గుణము లలో దేనిద్వారా బయటిపని జరిగినా, దానిద్వారా జీవునకు పాపము వచ్చునట్లు చేయుచున్నవి. ఇక్కడ సూత్రమేమనగా! ఒక గుణ ప్రేరణ వలన జరిగే పనిలో ఒక కర్మ పుట్టుచున్నది. చెడు గుణము వలన జరిగిన పనిలో పాపమూ, మంచి గుణము వలన జరిగిన పనిలో పుణ్యమను పుట్టుక వచ్చుట సహజము. దీనినిబట్టి పాపపుణ్యముల పుట్టుక స్థానము గుణ చక్రమని తెలియుచున్నది. ఒక తామసగుణభాగములో మంచి, చెడు గుణములు మొత్తము పండ్రెండు ఉన్నట్లు, రాజసగుణభాగములోనూ పండ్రెండు గుణములు గలవు. అట్లే సాత్త్విక గుణభాగములోనూ పండ్రెండు గుణములు గలవు. మొదటి తామస గుణభాగములో మిత్ర, శత్రువులు