పుట:Jyothishya shastramu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వున్నది. గుణచక్ర చిత్రమును ఈ క్రిందగల 6వ పటమునందు చూడవచ్చును.

గుణ చక్రము - 6వ పటము

గుణచక్రములోని మూడు భాగములకు మూడు పేర్లు గలవు. మూడు పేర్లు బయటనుండి వరుసగా తామస,రాజస,సాత్త్వికము అని గలవు. మధ్యలోనున్న బ్రహ్మనాడి ఇరుసు భాగములో ఆత్మ ఉండును. అందువలన దానిని ‘ఆత్మభాగము’ అంటాము. మధ్యలోని ఆత్మ భాగము గుణచక్రమునకే కాక అన్ని చక్రములకూ ఉండును. ఇక్కడ మధ్యలోని ఆత్మభాగమును వదలివేస్తే, మిగిలిన గుణభాగములు మూడు మాత్రమే ఉండును. బ్రహ్మవిద్య ప్రకారము గుణచక్రమును ఆత్మ భాగముతో కలిపి నాల్గుభాగములని చెప్పవలెను. కానీ జ్యోతిష్యశాస్త్రము ప్రకారము మనకు అవసరమైనవి మూడు భాగములు మాత్రమే. అందువలన ఇక్కడ గుణచక్రమును, మూడు భాగములుగానే చెప్పుకోవలెను. మూడు భాగములలోనూ గుణములుండును. మనకు అర్థమగుటకు ముందు ఒక గుణభాగమును తీసుకొని చూచెదము. తామస గుణ భాగమును చూస్తే, అందులో రెండు గుంపులుగానున్న గుణములు ఉండును. ఆ రెండు గుంపులలో ఒక గుంపు గుణములు చెడు