పుట:Jyothishya shastramu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అను రెండు గుంపుల గుణములున్నట్లే, మిగత రెండు గుణభాగములలోను గలవు. దీని ప్రకారము మూడు భాగములలో మొత్తము గుణముల సంఖ్య ‘36’ గా తెలియుచున్నది. ఒక భాగములోని 12 గుణములకు మరొక భాగములోని 12 గుణములకు పేర్లు ఒకే విధముగా ఉన్నవి. కానీ ఒక భాగములోని ‘ఆశ’ అను గుణమునకు, మరొక భాగములోని ‘ఆశ’ అను గుణమునకు కొంత తేడా ఉండును. ఇట్లు ఒక భాగములోని గుణమునకు మరొక భాగములోని గుణమునకు కొంత భేదము ఉన్నట్లు, మిగత అన్ని గుణములకు భేదము ఉండునని తెలియవలెను. అదే విధముగా ఒక భాగములోని క్రోధము వలన వచ్చు పాపమునకు, మరొక గుణభాగములోని క్రోధము వలన వచ్చు పాపమునకు కొంత తేడా ఉండును. ఒకే పేరు కల్గిన గుణములు, మూడు భాగములలో ఉండినప్పటికీ, అవి కొంత భేదము కల్గియున్నట్లు, వాటి వలన వచ్చు పాపపుణ్యములను కర్మ కూడా కొంత భేదము కల్గియుండునని గుర్తుంచుకోవలెను. ఈ విషయము అర్థమగుటకు క్రింది చిత్రము కొంత ఉపయోగపడును. కావున 7వ పటమును చూడుము.


గుణచక్రము - 7వ పటము