పుట:Jyothishya shastramu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ జాతకుని జన్మలగ్న కుండలిలో కన్యాలగ్నము జన్మలగ్నమని తెలిసిపోయినది. ఆత్మల వరుస ప్రకారము 2:1 అను సూత్రము ప్రకారము కన్యాలగ్న జాతకునికి శుభగ్రహము అశుభగ్రహములు తెలిసిపోవుచున్నవి. శుభ అనగా పుణ్యమును పాలించు మిత్రత్వముగల గ్రహములనీ, అశుభ అనగా పాపమును పాలించు శత్రుత్వగ్రహములని చెప్పవచ్చును. కన్యా లగ్నమునకు శుభ, అశుభగ్రహములు ఇలా గలవు చూడండి.

భూమి మీద మనిషి జనన సమయమునుబట్టి, కాలచక్రములో సూర్యుని కదలికనుబట్టి జన్మ లగ్నమైన తమ స్థానము తెలిసిపోవుచున్నది. కుండలిలోని పన్నెండు స్థానములలో జన్మలగ్నము ఏదైతే అది శరీర స్థానమైనప్పుడు అక్కడినుండి చివరిది పన్నెండవది వ్యయం స్థానమగు చున్నది. పన్నెండు లగ్నములలో మంచి చెడు గ్రహములుండగా, పన్నెండు రాశులలో అనగా కర్మచక్ర స్థానములలో పాపపుణ్యముల కర్మలుండును. పుణ్య కోణములను 1,5,9 స్థానములలో మనిషి పుణ్యముండగా, పాపకోణములనబడు 3,7,11 స్థానములలో పాపముండును. మూడు