పుట:Jyothishya shastramu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థానములలో పుణ్యము, మూడు స్థానములలో పాపము ఉండగా, మిగిలిన ఆరు స్థానములలో పాపపుణ్య మిశ్రమము ఉండును. కర్మచక్రములోని పాప పుణ్యరాశుల మీద గ్రహములు కిరణములను ప్రసరింపజేయుచూ కాలచక్రములో తిరుగుచున్నవి. అలా తిరుగుచూ జనన సమయములో వారు ఏ లగ్నములలో ఉన్నారో క్రింది పటములో తెలుసుకొందాము.

గుండ్రని గుర్తుతో గుర్తించిన గ్రహములు ఆ స్థానములో లేకున్నా మిగత స్థానములలో ఉండి అక్కడినుండి తమ హస్తములను ఉంచి ఈ రాశులలోని కర్మలను గ్రహిస్తాయని తెలియవలెను. గుండ్రని గుర్తులేని గ్రహములు జనన సమయములో మనము గుర్తించిన లగ్నములలో ఉండి అక్కడే పనిని చేయుచున్నవని తెలియుచున్నది.