పుట:Jyothishya shastramu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక్కడ పైన చూపించిన జన్మలగ్నకుండలిలో పన్నెండు గ్రహలను మొత్తము ముఫ్పై స్థలములలో చూపడము జరిగినది. పదునెనిమిది (18) చోట్లనున్న గ్రహములకు చుట్టూ గుండ్రని గుర్తు పెట్టడము జరిగినది. మిగత పన్నెండు (12) గ్రహములకు గుండ్రని గుర్తులేదు. గుండ్రని గుర్తులేనివి జన్మ సమయములో ఆయా స్థలములోనున్నవని తెలియువలెను. తులలో కుజుడు, వృశ్చికములో శుక్ర బుధులు, ధనస్సులో సూర్య గురు రాహు చిత్రగ్రహములు, వృషభములో శని, మిథునములో భూమి చంద్ర కేతు మిత్రగ్రహములు జనన సమయములో ఉన్నట్లు గుర్తించాము. గుండ్రని గుర్తులోపలనున్న గ్రహములు అక్కడ లేకున్నా తమ చేతుల ద్వారా ఆ లగ్నములను తాకినట్లు లెక్కించుకోవలెను. గ్రహములు చేతులనుంచినా అక్కడున్నట్లే లెక్కించబడుచున్నవి.