పుట:Jyothishya shastramu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏకాదశ స్థానము - లాభ స్థానము

కర్మచక్రములో పదకొండవ స్థానము పాపకోణములో చివరిదగును. ఈ స్థానములో కేవలము పాపము మాత్రముండును. అక్కడ చేరిన శుభ గ్రహముల వలన ఎదురు స్థానములోని పుణ్యము ఉపయోగపడుట వలన కొంతవరకు మంచి జరుగును. పాపగ్రహముండిన ధనార్జనలో కష్టము, లాభములో నష్టము, జయములో అపజయము కల్గును. విద్య లేకుండ పోవును. తండ్రి ఆస్తిని పోగొట్టుకోవలసి వచ్చును. జీవితము దుఃఖమయ మగును. సప్త వ్యసనములలో కొన్నిటికి అలవాటుపడిపోవును. ఈ విధముగా అక్కడ చేరు పాపగ్రహములనుబట్టి దుష్ఫలితములుండును. ఒకవేళ పదకొండవ స్థానములో ఒక శుభగ్రహముండినా లేక తాకినా జాతకునికి గ్రహమునుబట్టి మంచి జరుగును. ఈ స్థానమును లాభస్థానమని పెద్దలు చెప్పారు కనుక ఇక్కడున్న గ్రహమునుబట్టి కట్నరూపములో ఒక్కమారు డబ్బువచ్చునట్లు ఆ గ్రహము చేయును. బుధగ్రహముంటే కట్నకానుకల రూపములో మంచి లాభమును చేకూర్చును. తొమ్మిదవ స్థానాధిపతియుండిన, వానికి లాటరీవలన లాభము వచ్చును. లగ్నాధిపతి యుండిన ఎల్లప్పుడు లంచము రూపములోనో లేక కమీషన్‌ రూపములోనో డబ్బు వచ్చునట్లు చేయును. పంచమాధిపతియుండిన మెడికల్‌ కాలేజ్‌ లాంటిది కల్గించి దానిద్వారా డొనేషన్లరూపములో డబ్బు విపరీతముగా వచ్చునట్లు చేయును. ఈ స్థానములో ఇద్దరు లేక ముగ్గురు శుభ గ్రహములు ఉండిన ఉన్నట్లుండి కోట్లలో డబ్బు వచ్చు లాటరీలు తగులును. వ్యాపారములో విపరీతముగా లాభములు వచ్చును. అన్న, అక్కగారి ఆస్తులు లభించును. ఒక రూపముగా కాకుండా అనేక రూపములలో అనేక లాభములు వచ్చునట్లు అమరిపోవును. ఇది పదకొండవ స్థానమగుట వలన పాపకార్యములు చేయుట చేత జాతకుడు ధనమార్జించును. లేఖన