పుట:Jyothishya shastramu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృత్తి అయిన విలేఖరిగాయుంటూ ధనమును బాగా సంపాదించగలుగును. ఐదవ స్థానమునకు ఎదురుగా ఉన్నందున అందులోని విద్యనూ, ప్రతిభనూ, గ్రాహితశక్తిని, శిల్పకళ విద్యను నేర్వగలుగును. ఎన్నో ఆదాయములు గల స్థానము కావున దీనిని లాభస్థానమని అన్నారు. అంతేకాక వృత్తిలోకంటే ఎక్కువ లాభము వచ్చుట వలన ప్రవృత్తి స్థానమన్నారు. పైకి కనిపించుటకు ఇది ప్రవృత్తి స్థానముగాయున్నా ముందే ఇది పాపస్థానమైయుండి, దీనిలో చేయునదంతా ఇతరులది లాగుకొని లాభము పొందడము తప్ప ఏమీలేదు. దానివలన పాపము రావడము తప్ప పుణ్యమొచ్చు అవకాశము లేదు. అందువలన కొందరు ఇది ప్రవృత్తి స్థానమనినా మేము మాత్రము దీనిని నీచ వృత్తి స్థానమేగానీ ఇందులో ప్రవృత్తి లేదని చెప్పుచున్నాము.

ద్వాదశ స్థానము - వ్యయ స్థానము

మొదటి స్థానము జనన స్థానమగుట వలన, జననములో శరీరము లభించుట వలన దానిని తను (శరీర) స్థానమన్నారు. చివరిదైన పన్నెండవ స్థానము వచ్చిన శరీరము నాశనమైపోవునది కావున దానిని వ్యయ (నాశన) స్థానమన్నారు. జీవిత చివరి భాగము ఈ స్థానములోనే ఉండును. ఇది జీవితమునకు చివరి కాలము యొక్క విధి విధానమును తెల్పునది. కావున వయస్సు ముదిరిన తర్వాత వృద్ధాప్యములో జరుగు విషయములు ఇక్కడ తెలియును. ప్రారబ్ధకర్మ ప్రారంభమగునది మొదటి స్థానములోకాగా ప్రారబ్ధ కర్మ అయిపోవునది పన్నెండవ స్థానములో, కనుక ప్రారంభమగు ప్రథమ స్థానమును జనన స్థానమని అన్నారు. అయిపోవు స్థానమును మరణ స్థానము అన్నారు. పన్నెండవ స్థానములో కర్మ అయిపోవుచున్నది. కావున అతని (జాతకుని) ఆయుష్షు ఇంతయని చెప్పవచ్చును. అయితే ఇక్కడ