పుట:Jyothishya shastramu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలనగానీ, తుపాకుల వలనగానీ జాతకునికి మరణము సంభవించును. మిగత స్వపక్ష గ్రహము ఏది తోడైయున్నా రోడ్డు ప్రమాదములో రక్తసిక్తమై చనిపోవునట్లు చేయును. ఒకవేళ జనన కాలములో ఈ స్థానమున ఏ గ్రహము లేకున్నా, తాకకున్నా అతనికి (జాతకునికి) మంచి ఫలితములుగానీ లేక చెడు ఫలితములుగానీ కలుగక జీవితము సాధారణముగా జరిగిపోవును. అటువంటివాడు దీర్ఘ నాడి, స్పర్శనాడి లేకుండా మధ్యనాడి కల్గియుండునని కూడ చెప్పవచ్చును.

నవమ స్థానము - పితృ స్థానము

కర్మచక్రములో నాలుగు (4) ఐదు (5) స్థానములు ఎంతో ముఖ్యమైనవి. అలాగే తొమ్మిది (9) పది (10) స్థానములు కూడా ముఖ్యమైనవిగాయున్నవి. జాతకచక్రములో నాలుగు, ఐదు స్థానములు ఎంత ప్రశస్తత చెందియున్నాయో అంత ప్రాముఖ్యత కల్గియున్నవి తొమ్మిది (9) పది (10) స్థానములని అందరూ తెలియవలెను. మనిషి జీవితములో ఎంతో ముఖ్యమైన ఆస్తిబలము (సంపద బలము), బుద్ధిబలము ఎంతో ముఖ్యమైనవి. ఆస్తిబలము నాల్గవ స్థానములోనూ, బుద్ధిబలము ఐదవ స్థానములోను ఉన్నవి. అలాగే మనిషి జీవితములో ధనబలము, గౌరవము ఎంతో అవసరమైనవి. ధనబలము తొమ్మిదవ స్థానములోనూ, గౌరవము పదవ స్థానములోనూ ఉండుట వలన కర్మచక్రములో ఈ నాలుగు స్థానములు ముఖ్యమైనవేనని తెలియుచున్నది. నాలుగు, ఐదు స్థానములలో నాలుగవ స్థానములో పాపపుణ్యములు రెండూ ఉండగా అది అంగీ భాగమునకు కేంద్రముగాయున్నది. ఐదవ స్థానము పూర్తి పుణ్యస్థానమైయున్నదని ఈ గ్రంథము చదివిన వారిందరికీ తెలుసు. అలాగే తొమ్మిది పది స్థానములలో