పుట:Jyothishya shastramu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంగలోపముండదు, స్త్రీల వలన దుఃఖముండదు. శత్రు భయము ఉండదు. కారాగార ప్రాప్తిగానీ, చట్టమును మీరి నడువడముగానీ కలుగదు. జంతు వధలు చేయడు, పాపభీతియుండును. అకాల మృత్యు భయముండదు. చేయు పనిలో ప్రతిభ కల్గియుండును. కళత్ర సుఖముండును, అన్యస్త్రీల సాంగత్యము కలుగును. ఒకవేళ జనన సమయములో ఈ స్థానమున పాపగ్రహముండినట్లయితే అది అక్కడున్న పాపమును స్వీకరించి జాతకునికి అందించును. పుణ్యమును తీసుకోదు. పాపగ్రహము వలన అతనికి పాపకర్మ అనుభవములే కల్గును. అకాల మృత్యువు ఏర్పడును. ఒకవేళ అకాల మృత్యువు లేకున్నా ఆయుష్షు తొందరగా అయిపోవును. అనగా అల్పాయుష్కుడగును. పరాభవములు కల్గును. కారాగార ప్రాప్తి కలుగును. ఇతరులచే ప్రాణహాని భయముండును. స్త్రీ సుఖముండదు. స్పర్శనాడి కలవాడై మగతనమున్నా నిమిషము లేక అరనిమిషములో కామవాంఛ తీరిపోవును. దానివలన నిరాశ ఏర్పడును. స్త్రీలతో అవమానము కల్గును. ఎనిమిదవ స్థానమున శత్రు గ్రహముగ రాహువున్న విషాహారము వలనగానీ, పాముకాటు వలనగానీ చనిపోవునని చెప్పవచ్చును. చంద్రుడు పాపియై అష్టమమున ఉన్న నీటిగండముతో చనిపోవునని చెప్పవచ్చును. అలాగే శుక్రుడు శత్రుగ్రహమై ఎనిమిదవ స్థానమున ఉండినట్లయితే జీవితములో సమయము చూచి అగ్ని వలన కాలి చనిపోవునని చెప్పవచ్చును. ఒకవేళ బుధగ్రహము ఎనిమిదవ స్థానమున ఉన్నట్లయితే జాతకుని శరీరములో దయ్యములు చేరి డాక్టర్లకు అంతుదొరకని రోగమును కల్పించి దయ్యములే చంపివేయును. ఎనిమిదవ స్థానమున కుజగ్రహము అశుభగ్రహముగా యుండినట్లయితే అట్టి జాతకుడు ఆయుధములచేత చంపబడునని చెప్పవచ్చును. కుజగ్రహమునకు భూగ్రహము తోడైయుంటే బాంబుల