పుట:Jyothishya shastramu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ జాతకుని విషయములో ఒక ప్రశ్న వచ్చినది. అదేమనగా! ఈ జాతకుడు భవిష్యత్తులో ఏమి వ్యాపారము చేయును? అని అడిగినప్పుడు ఆ ప్రశ్నకు జవాబును జ్యోతిష్యము ప్రకారము వెదుకవలసినప్పుడు, మొట్టమొదట పన్నెండు గ్రహములలో ఏయే గ్రహములు ఇతని విషయములో మంచిగా (మిత్రులుగా) పని చేయుచున్నవో, ఏయే గ్రహములు చెడుగా (శత్రువులుగా) పని చేయుచున్నవో తెలియవలసియున్నది. జన్మ లగ్నము వృశ్చికలగ్నము కనుక సరి బేసి (2:1) అను సూత్రము ప్రకారము పన్నెండు గ్రహములను మిత్రులుగా, శత్రులుగా విభజించి చూడవచ్చును. మేష లగ్నమునకు 8, 9 లగ్నములుగా వృశ్చికము, ధనస్సుయున్నవి కావున బేసి సరి సూత్రము ప్రకారము వృశ్చిక, ధనస్సు రెండు లగ్నముల అధిపతులు ఆ జాతకునికి మిత్రులుగాయున్నారు. ఆ రెండు లగ్నముల తర్వాత రెండు లగ్నాధిపతులను శత్రువులుగా గుర్తించితే రాహువు, శని శత్రువులుగా యున్నారని తెలియుచున్నది. ఆ విధముగా వృశ్చిక లగ్న జాతకునకు మిత్ర శత్రువులు ఈ విధముగా గలరు.