పుట:Jyothishya shastramu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
53వ పటము.


కూడా కలిపి గ్రహములుగా లెక్కించితే ముప్పై సంఖ్య వచ్చు చున్నది. మొత్తము గ్రహములున్నది = 12, ప్రతి గ్రహము ఎదురుగాయున్న ఏడిరటిలోని దానిని గ్రహించగల్గుచున్నది. కావున అక్కడ కూడా ఆ గ్రహమున్నట్లు లెక్కించితే 12+12 = 24 అగును. పన్నెండు గ్రహములలో గురు, కుజ, శని ప్రత్యేకించి రెండు స్థానములలోని వాటిని స్వీకరించును. కావున అక్కడ కూడ ఆ మూడు గ్రహములను ఉన్నట్లు లెక్కించుకొంటే 3×2=6 అగును. 24+6ను కలిపితే మొత్తము 30 సంఖ్యగా కనిపించు చున్నది. అదే విధముగా మనము గుర్తించుకొన్న జన్మకుండలిలో 30 గ్రహములు 12 లగ్నములలో కనిపించుచున్నవి. జన్మ లగ్నమున గ్రహములు ఏ స్థానములో ఉన్నవో జీవితాంతము అదే స్థానమునుబట్టి ఫలితమును ఇచ్చుచుండును.